YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పవన్ కల్యాణ్ తో దోస్తీపై నిరసన - హీరోను చేయడమేమిటని ప్రశ్నించిన.. మాజీ ఎమ్మెల్యే సంపత్

పవన్ కల్యాణ్ తో దోస్తీపై నిరసన - హీరోను చేయడమేమిటని ప్రశ్నించిన.. మాజీ ఎమ్మెల్యే సంపత్

పవన్ కల్యాణ్ తో దోస్తీపై నిరసన - హీరోను చేయడమేమిటని ప్రశ్నించిన.. మాజీ ఎమ్మెల్యే సంపత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో దోస్తీ కట్టడంపై తెలంగాణ కాంగ్రెసులో నిరసన వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయాలనే నిర్ణయాన్ని "ఎఐసిసి కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్ " తీవ్రంగా వ్యతిరేకించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని నిర్వహించిన అఖిల పక్ష భేటీకి కాంగ్రెసు నేతలు హాజరైన విషయం తెలిసిందే. తెలంగాణలో యురేనియం తవ్వకాలపై పవన్ కల్యాణ్ కు ఏం సంబంధమని సంపత్ కుమార్ ప్రశ్నించారు. జనసేన బ్యానర్ పై స్టార్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి 130 ఏళ్ల చరిత్ర కలిగిన మనం వెళ్లడం ఏమిటని ఆయన అడిగారు. తెలంగాణ కాంగ్రెసు నేతలపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, ఎంపీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు వంటి నాయకులు అక్కడకు వెళ్లి 4 గంటలు కూర్చోవడమేమిటని ఆయన అడిగారు. మన బలంతో పవన్ ను హీరో చేయడమెందుకని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ నిర్వహించిన సమావేశానికి కాంగ్రెసు నేతలు వెళ్లడంపై మంగళవారం జరిగిన టీపీసిసి కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వాడిగా వేడిగా చర్చ జరిగింది. తవ్వకాలపై ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిశామని, మాజీ ఎమ్మెల్యే వంశీ పోరాటం చేస్తున్నారని ఉత్తమ్ సిఎంకు లేఖ రాశారని గుర్తు చేశారు. ఇటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా చూస్తామని కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా హామీ ఇచ్చారు.

Related Posts