YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

యాదవుల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని  కొల్లాపూర్లో భగ్నం చేసిన పోలీసులు

యాదవుల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని  కొల్లాపూర్లో భగ్నం చేసిన పోలీసులు

యాదవుల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని  కొల్లాపూర్లో భగ్నం చేసిన పోలీసులు
కొల్లాపూర్, సెప్టెంబర్ 18 
కురుమ యాదవులకు రెండో విడత గొర్రెల పంపిణి  ఇంకా చేయకపోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర  గొర్రెల కాపరుల సంఘం పిలుపు మేరకు ఈరోజు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయడంలో భాగంగా, కొల్లాపూర్ కూడా  బరిగెల వేణుగోపాల్ యాదవ్, మేకల రాముడు యాదవ్, బరీగెల ఎల్లయ్య యాదవ్, మేకల సాయిలుయాదవ్, బ రిగెల రాముడు యాదవ్ తదితర సంఘం నాయకులను ఈరోజు తెల్లవారుజామున అరెస్టు చేసి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉంచుటకు నిరసనగా  , యాదవ జాగృతి ఆధ్వర్యంలో  సంఘీభావం ప్రకటించిన జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో యాదవ జాగృతి సేన గౌరవ అధ్యక్షులు బరిగేల బాలయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే రెండో విడత గొర్రెల పంపిణిని అవినీతికి తావులేకుండా పారదర్శకంగా వెంటనే చేపట్టాలని, గత ప్రభుత్వాలు గొర్రెలను మేపేందుకు ఇచ్చిన భూములకు సంబంధించిన  జీవోలను వెంటనే అమలు చేయాలని,కుల వృత్తిలో భాగంగా గొర్రెలను మేపుకొనుటకు  బంజరు భూములు లేకపోవడం, కనీసం మందను ఇంటిదగ్గర నైనా  ఆపు కొందామంటే ఊరిలోకి రానీయకుండా వాటిని బహిష్కరించడం శ్రీపతి పల్లి గ్రామంమే ఒక ఉదాహరణ, యాదవ జాతిలో అక్షరాస్యత లేక అన్ని రంగాలలో వెనుకబడి పోయారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరికి ప్రత్యేక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని,  55 సంవత్సరాలు దాటిన గొర్రెల కాపరులకు పింఛను మరియు 5లక్షల బీమాను వెంటనే ప్రకటించాలని , మన తాతముత్తాతలు అడవిలోనే జీవనం కొనసాగించారని , ప్రస్తుతం కూడా అత్యధిక జనాభా, అధిక ఉత్పత్తి చేసుకుంటూ సమాజానికి తోడ్పడు తున్నారని, ఇకనైనా ఆధునిక సమాజంలో లో ప్రజాస్వామిక పద్ధతిలో , మనమందరం ఏకమై మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.. ఈ కార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు రామ స్వామి యాదవ్, గడ్డం శేఖర్ యాదవ్, నాగ శేషు యాదవ్, మాదాసి కురువ సంఘం నాయకులు  ఒరే చిన్న మల్లయ్య , భాస్కర్ యాదవ్, గొర్ల సంఘం అధ్యక్షులు మల్లేష్, ఉశన్న యాదవ్, కుడికిళ్ళ కొమ్ము నరసింహ యాదవ్, శ్రీనివాసరావు,గిరిజన సంఘం నాయకులతోపాటు మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్, ఎమ్మార్పీఎస్ నాయకుడు రవి, సిపిఎం నాయకుడు శివ వర్మ  , వాల్మీకి సంఘం నాయకులు శివయ్య మద్దతు పలికారు.

Related Posts