YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తాను వచ్చే నాలుగేళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే: కోమటిరెడ్డి 

తాను వచ్చే నాలుగేళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే: కోమటిరెడ్డి 

తాను వచ్చే నాలుగేళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే: కోమటిరెడ్డి 
హైదరాబాద్, సెప్టెంబర్ 18
సాంకేతికంగా తాను వచ్చే నాలుగేళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలోకి వెళ్లాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వెళ్తానన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కేసీఆర్ సాధు జంతువు లాంటి కాంగ్రెస్‌ను చంపి.. పులి లాంటి బీజేపీని బలపర్చారన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడాక కాంగ్రెస్ పని ఖతమైందని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా ఉన్నంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే గడ్డం తీసేస్తానన్న ఉత్తమ్... ఓడిపోయాక కూడా గడ్డంతోనే తిరుగుతున్నారని.. జనం ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపోటములు ఉత్తమ్‌పై ఆధారపడి ఉన్నాయన్నారు. డిండి ప్రాజెక్టు భూసేకరణ నిధుల కోసం మంత్రి హరీశ్‌రావును కలిశానన్నారు. కాలేజీ రోజుల నుంచే హరీశ్‌రావు తనకు మంచి మిత్రుడని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

Related Posts