
మచిలీపట్నం
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. భవిష్యత్తు పై ఎన్నో ఆశలతో బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధిని పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురిచేసాడు. ఈమేరకు బాధిత విద్యార్ధిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. తన కోరిక తిరిస్తేనే పాస్ చేస్తానని లేకుంటే ని జీవితం నాశనం చేస్తానని కాలేజి ప్రిన్సిపాల్ రమేష్ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఘటనా స్థలంలో మనస్థాపానికి గురయిన బాధితురాలి తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో అయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాలేజి ప్రిన్సిపాల్ రమేష్ ను తక్షణమే అరెష్టు చేయాలని విద్యార్ధి సంఘాలు ధర్నాకు దిగాయి. అందోళనకారులను పోలీసులు అరెస్టు చేసారు.