
కాకినాడ, జూలై 14,
టీడీపీ అతిపెద్ద రీజనల్ పార్టీ. పైగా బలహీనవర్గాలకు పెద్దపీట అనే నినాదంతో వచ్చిన ఆ పార్టీ..ఎందరో సామాన్యులను నాయకులుగా తయారు చేసింది. అలా నాలుగున్నర దశాబ్ధాల టీడీపీ పార్టీలో..సీనియర్ మోస్ట్ లీడర్లు చాలా మందే ఉన్నారు. ఐదారుసార్లు మంత్రులుగా పనిచేసిన వారు..ఆరేడు సార్లు గెలిచిన వాళ్లు..సామాజిక వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా సైకిల్ పార్టీకి బలమైన అనుభవమున్న నేతలు ఉన్నారు.అయితే గత ఎన్నికలకు ముందు పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని..రాబోయే 40ఏళ్లు పార్టీ స్ట్రాంగ్‌గా నిలబడేలా నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలనే ఆలోచనతో..చాలామంది జూనియర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఫస్ట్ టైమ్ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడున్న క్యాబినెట్‌లో 18మంది కొత్త ముఖాలే. అయితే ఈ మధ్య మంత్రుల పనితీరుపై చాలా సీరియస్‌గా ఉన్నారు చంద్రబాబు.పనితీరు బాలేదని ముఖం మీదే చెప్పయడమే కాదు..మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రావణమాసం రాగానే..క్యాబినెట్‌లో ఇప్పటికే ఖాళీగా ఉన్న ఓ పోస్ట్‌ను భర్తీ చేయడంతో పాటు..నలుగురు, ఐదుగుర్ని తొలగించి వారి స్థానంలో కొత్తవాళ్లను తీసుకుంటారన్న ప్రచారం బయలుదేరింది.పనితీరు బాలేని జూనియర్లను క్యాబినెట్ నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలతో..సీనియర్లలో ఆశలు చిగురిస్తున్నాయట. ఉత్తరాంధ్ర టు రాయలసీమ వరకు టీడీపీలో చాలా మంది సీనియర్లు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారట. అయితే 2024లో బెర్త్ దొరకక కాస్త మౌనంగానే ఉంటూ వస్తున్నారు. జిల్లాలను శాసించే సీనియర్ లీడర్లు కాస్త..సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతూ వస్తున్నారు. అంతేకాదు వైసీపీపై విమర్శల విషయంలో కూడా మంత్రులదే బాధ్యత అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారట.అయితే సీనియర్ల లీడర్లతో అధినాయకత్వం బాగానే ఉంటోంది. మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా..పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వకపోయినా..పార్టీ కోసమే కొత్త నీరు అన్నట్లుగానే చెబుతూ వస్తోంది. ప్రభుత్వంలో పెద్దగా అనుభవం కలిగినవారు లేకపోవడంతో ధాటిగా విపక్షాల విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారట. ఇప్పుడున్న మంత్రివర్గంలో ఇద్దరు సీనియర్ లీడర్లు రామానాయుడు, పయ్యావుల కేశవ్ పనితీరు మీద మాత్రమే సీఎం సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి విస్తరణలో మళ్లీ సీనియర్లనే తీసుకుంటారని..తమకు అవకాశం దక్కబోతుందని హోప్స్ పెట్టుకుంటున్నారట సీనియర్ టీడీపీ లీడర్లుసబ్జెక్ట్‌పై పట్టుండేవారు. విపక్షం నుంచి ఒక విమర్శ రాగానే అన్ని లెక్కలతో సహా ఇచ్చిపడేసేవాళ్లు. రాజకీయంగా దూకుడుగా ఉండేవారు అవసరమని భావిస్తున్నారట. ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలంటే సీనియర్లుగా తమకే అవకాశం ఉంటుందనేది నేతల అంచనాలున్నాయట. ఈ క్రమంలోనే మంత్రివర్గంలో మార్పులు జరిగితే కనుక కచ్చితంగా సీనియర్లకు ధాటిగా మాట్లాడేవారికి కచ్చితంగా చోటు దక్కుతుందని ప్రచారం సాగుతోంది. దాంతో సీనియర్ లీడర్లలో ఫుల్ హుషార్ కనిపిస్తోందట.తమకు అమాత్య కిరీటలు దక్కే రోజు దగ్గరలోనే ఉందని ఊహల్లో తేలియాడుతున్నారట. మళ్లీ అధికారం చేపట్టాలంటే ప్రయోగాలను పక్కన పెట్టి..వైసీపీని కట్టడి చేసేందుకు సీనియర్లను రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే కొత్తగా పాత ముఖాలను క్యాబినెట్‌లో చూసే రోజులు దగ్గరలోనే ఉండబోతున్నాయ్. అమాత్య పదవి దక్కే సీనియర్ లీడర్లు ఎవరో చూడాలి మరి.