
సికింద్రాబాద్..
ఇటీవల ఎమ్మెల్సీ కవిత పట్ల తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల నేపద్యంలో తెలంగాణ జాగృతి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న పై కెసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుండి కదలమని హెచ్చరిస్తున్న మహిళలు. చైర్ పర్సన్ నేరెళ్ల శారద ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవిత పట్ల తీన్మార్ మల్లన్న చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. తెలంగాణ ఆడపడుచులను, మహిళలను అవమానించే విధంగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు తెలంగాణ మహిళా సమాజాన్ని కంటతడి పెట్టించినట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుదామని హెచ్చరించారు.