YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రారంభమైన చెర్రీ, బోయపాటి చిత్రం

ప్రారంభమైన చెర్రీ, బోయపాటి చిత్రం

హీరోగా రామ్‌చరణ్ 12వ చిత్రం ప్రారంభమైంది. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సినిమా ప్రారంభమైన విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. కాగా ప్రస్తుతం 'రంగస్థలం' షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్, బోయపాటి చిత్రం మొదటి షెడ్యూల్‌లో పాల్గొనడం లేదు. దీంతో మిగిలిన పాత్రాధారులపై షూటింగ్‌ను చేయనున్నారు బోయపాటి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లుగా కైరా అద్వాణి నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts