
ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి తో సహ ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్
ఈఎస్‌ఐ దవాఖానాలకు, డిస్పెన్సరీలకు మందులు కొనుగోలుచేసి సరఫరాచేసే సంస్థ ఐఎంఎస్ (ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) డైరెక్టరేట్‌లో భారీ కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కే పద్మ, వసంత ఇందిర (అసిస్టెంట్ డైరెక్టర్), రాధిక ఫార్మాసిస్ట్, హర్షవర్దన్ (సీనియర్ అసిస్టెంట్), ఓమ్నీ మెడి కంపెనీ ఎండీ శ్రీహరి, నాగరాజు (ఉద్యోగి) ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి..బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు.పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి ఏకకాలంలో 23 చోట్ల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పలు కీలకపత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఏసీబీ అధికారుల ప్రకటన ప్రకారం..ఇప్పటి వరకు రూ.11,69,12,485 మేర అక్రమాలు వెలుగుచూశాయి.