
ఎమ్మిగనూరు శ్రీరాం ఫైనాన్స్ కంపెనీలో చోరీకి విఫలయత్నం
ఎమ్మిగనూరు
శనివారం తెల్లవారు జామున పట్టణంలోని శ్రీరాం ఫైనాన్స్ కంపెనీలో గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. కార్యాలయం తాళాలు పగులగొట్టి ఏమైందో ఏమో లోపలికి వెళ్లకుండా వెనుదిరిగారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన మేనేజర్ పగిలిన తాళం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ వి.శ్రీధర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ నవాజ్,
కృష్టప్ప లు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. వివరాలను సేకరించారు. కార్యాలయంలో గదులను పరిశీలించారు. అయితే దొంగలు స్టేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న శ్రీరాం ఫైనాన్స్ ను ఎంచుకోవడం చోరీకి వచ్చి వెనుదిరగడంపై అనుమానాలు వ్యకమవుతున్నాయి. పెద్ద దొంగతనానికి ముందు రెక్కీ నిర్వహించారా అన్న సందేహాలు
వ్యక్తమవుతున్నాయి. దొంగతనానికి వచ్చింది చిల్లర దొంగలా..లేక ఎక్స్ పర్ట్ దొంగలా అన్నది తెలాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్యలయం వెలుపల సీసీ కెమెరాలు లేకపోవడంపై పోలీసులు
అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.