YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు

చెవితో బెలూన్లు ఊదడం చూశారా..?

చెవితో బెలూన్లు ఊదడం చూశారా..?

సాధారణంగా నోటితో బెలూన్‌ ఊదాలంటేనే కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది ఏకంగా చెవితోనే బెలూన్లు తెగ ఊదేస్తున్నాడో వ్యక్తి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మణిశంకర్ పాండే నోటికి బదులు చెవితో బెలూన్లు ఊదేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. బెలూన్లు మాత్రమే కాదు.. కొవ్వొత్తులను కూడా చెవితో గాలి ఊది ఆర్పగలడట.

సోన్‌బ‌ద్ర జిల్లాకు చెందిన మణిశంకర్ ఇలా చెవితో గాలి ఊదే నైపుణ్యం సంపాదించాడట. ఏళ్ల తరబడి సాధన చేసే ఇంతటి ప్రావీణ్యం సంపాదించినట్టు చెబుతున్నాడు. సరైన సహకారం, ప్రోత్సాహం అందిస్తే తప్పకుండా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటానని అంటున్నాడు. మణిశంకర్ చెవితో బెలూన్లు ఊదుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై ఓ లుక్కేయండి.. 

Related Posts