
రెచ్చిపోతున్న దొంగలు
అనంతపురం సెప్టెంబర్ 30,: నెల రోజులుగా వరుస చోరీలతో అనంతపురం జిల్లా గుత్తి పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.ఆదివారం పట్టపగలే తాళం వేసిన ఓ ఇంటి తలుపులు బద్దల కొట్టి ఇంటిలో ఉన్న రూ:10లక్షల నగదు అపహరించారు. అనంతపురం జిల్లా గుత్తిలో పట్టపగలే చోరీ జరిగింది. రూ:10లక్షల నగదును అపహరించారు. పోలీసులు బాధితుడు తెలిపిన వివరాల మేరకు సంఘటనకు సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి . స్థానిక అంబేద్కర్ కాలనీలో నివాసముండే బీజేపీ జిల్లా నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తనయుడు నివాసులు అలియాస్ దిల్కా శీనా ఇంటిలో దొంగలు పడి ఇంటిలో ఓ గదిలో దాచి ఉంచిన రూ:10లక్షల నగదును ఎత్తు కెల్లిపోయారు.గత ఐదు రోజుల క్రితం దిల్కా శీనా తన ప్లాట్ విక్రయించి వచ్చిన రూ:22,40,000లను ఓ అట్ట పెట్టెలో పెట్టి ఇంటిలో ఓగదిలో భద్రపరిచాడు.ఆదివారం అవ్వడంతో కుటుంబ సభ్యులు అందరు కలసి ఇంటి తాళం వేసి ఉదయం 8గంటలకు చర్చీకి వెళ్లారు.తిరిగి 11గంటలకు ఇంటికి వచ్చారు తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చింది.ఇంటిలోకి వెల్లి చూడగా గది తాళాలు పగలగొట్ట పడి ఉన్నాయి.గదిలో వెల్లి చూడగా అట్టపెట్టెలో దాచి ఉంచిన రూ:22లక్షల 40వేల నగదులో 10లక్షలు కనిపించలేదు.దీంతో చోరీ జరిగినట్టు భావించి బాధితుడు పోలీసులకు పిర్యాదు చేసాడు.పోలీసులు సంఘటన జరిగిన ఇంటిలో చోరీ జరిగిన తీరును డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీం ద్వారా పరిశీలించి ఆధారాలు సేకరించారు.ఈ సంఘటన పై ఇంట్లో కుటుంబ సభ్యులనందరిని విచారించి దర్యాప్తు చేస్తున్నారు.