YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీ సీఎం సలహాదారు రాజీనామా..

ఢిల్లీ సీఎం సలహాదారు రాజీనామా..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సలహాదారు తన పదవికి రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను సీఎం కార్యాలయం, లెఫ్టినెంట్ గవర్నర్లకు పంపినట్లు పేర్కొన్నారు.  గతేడాది సెప్టెంబరులో ఢిల్లీ అర్బన్ షెల్టర్   ఇంప్రూవ్ మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రిటైరైన ఆయనను కొద్ది రోజులకే సియం సలహాదారుగా నియమించబడ్డారు.  ఇటీవల ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్ పై జరిగిన ఎమ్మెల్యేల దాడి విషయంలో ఢిల్లీ పోలీసులు ఆయనను ప్రశ్నించారు. ఇటీవల ఆయన వారం పాటు మెడికల్ లీవ్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Posts