YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె

అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె హైద్రాబాద్, అక్టోబరు 4 : తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వ త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ ప్రకటించింది. సమ్మె విషయంలో వెనక్కు తగ్గేది లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి కార్మికుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదని.. అధికారులు ఏం చెప్పే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చాలా కష్టపడ్డ విషయాన్ని మర్చిపోకూడదన్నారు.గతంలో ప్రభుత్వం వేసిన కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదని.. ఆర్టీసీని బతికించడానికే తమ పోరాటం అన్నారు అశ్వత్థామరెడ్డి. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కు తగ్గేది లేదన్నారు లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వమే కాపాడాలని.. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఇప్పటికే నిలిచిపోయాయి అన్నారు. మరోవైపు సమ్మెపై ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. సమ్మె చట్ట విరుద్ధమని.. సమ్మెలో ఉద్యోగులు పాల్గొంటే డిస్మిస్ చేస్తామన్నారు. అవసరమైతే ఎస్మాను ప్రయోగిస్తామని తేల్చి చెప్పారు. సమ్మె వైపుగా ఆర్టీసీ కార్మికులు అడుగులు వేస్తుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రైవేట్ బస్సులు, డ్రైవర్లతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే దసరా కావడంతో.. సమ్మె ప్రభావం ప్రయాణికులకు కొత్త కష్టాల్లో పడేస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచే నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సమ్మెను సాకుగా చూపించి ప్రైవేట్ ట్రావెల్స్ అందింనకాడికి దోచుకుంటున్నాయి. టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి.

Related Posts