
చిత్తూరు
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో ఓ విలేకరిపై జరిగిన దాడి మీద మాజీ మంత్రి నారాయణ స్వామి వివరణ ఇచ్చారు. 'ఈ ఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మంత్రి లోకేశ్ నిజనిజాలు తెలుసుకోకుండా స్పందించడం పద్ధతి కాదు. నా జీవితంలో ఎప్పుడూ ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేయలేదు. హామీలు అమలు చేయాలని ప్రశ్నించడం తప్పా? అనవసర కేసుల్లో నన్ను, చిత్తూరు ఇన్ఛార్జ్ విజయనందరెడ్డిని ఇరికించడం సరికాదు' అంటూ ఆయన వీడియో విడుదల చేశారు.