YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

డేటింగ్...చీటింగ్

డేటింగ్...చీటింగ్

డేటింగ్...చీటింగ్
హైద్రాబాద్, 
డేటింగ్ సరదా పలువురిని ఇబ్బందులకు గురిచేస్తోంది. చాలా మంది యువకులకు వివిధ వెబ్ సైట్లలో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి డేటింగ్‌కు ఆహ్వానిస్తున్నారు. ఇది నిజమని నమ్మిన యువకులు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే యువతి నుంచి ఫోన్ వస్తోంది. ఈ విధంగా డ్యాషిడేటింగ్. ఇన్ అనే ఓ వైబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసి తనపేరు పూనం అని, వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే డేటింగ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని చెప్పడంతో నగరానికి చెందిన యువకుడు బ్యాంక్ ఖాతిలో డిపాజిట్ చేశాడు. ఇలా పలుమార్లు ఫోన్ చేసి డబ్బులు డిపాజిట్ చేయమనడంతో మొత్తం రూ.4.08లక్షలు చెల్లించాడు.తర్వాత వెబ్‌సైట్ నిర్వాహకులు డేటింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా చాలామంది యువకులు, యువతులు డేటింగ్ పేరుతో మోసపోతున్నారు. వారిబారినపడి విలవిలలాడుతున్నారు. కొందరు ఛీటర్లు డేటింగ్ కోసం మొబైల్ ఫోన్లకు మెసెజ్‌లు పంపించి మోసం చేస్తున్నారు. వారు పంపించిన లింక్‌ను ఓపెన్ చేయగానే వారి ప్లాన్ రెడీ అవుతుంది. అప్పటి నుంచి వివిధ రకాల పేర్లు చెప్పి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.డేటింగ్ పేరుతో మోసం చేసే వారు ఏకంగా కాల్ సెంటర్‌ను నడుపుతున్నారు. టెలీకార్లను ఏర్పాటు చేసుకుని వారితో ఫోన్లు చేయిస్తూ డబ్బులు వసూలు చేసి తర్వాత మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఈ ముఠాలు ఎక్కువగా పశ్చిమబెంగాల్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా పలువురిని మోసం చేసిన నిందితులను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు డేటింగ్ పేరుతో లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. గేట్‌యువర్‌లేడీ.కామ్, మైలవ్18.ఇన్, వరల్డ్‌డేటింగ్.కామ్ పేరుతో పలు వెబ్‌సైట్లు ఉన్నాయి. వీటిలో అందమైన యువతుల ఫొటోలు పెట్టి పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు.డేటింగ్ వెబ్ సైట్ నిర్వాహకులు అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిని వివిధ పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. యువతులను టెలీ కాలర్లుగా నియమించుకుని ఈ దందా చేస్తున్నారు. ముందుగా సభ్యత్వం కోసం డబ్బులు తీసుకుంటారు. క్లబ్ లైసెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, సర్వీస్ ఛార్జీ, జిఎస్‌టి, అకౌంట్ వెరిఫికేషన్, బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ ఫీజు, ఫైనల్ పేమెంట్ ఫీజు తదితర వాటి పేరు చెప్పి బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు.

Related Posts