YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గంటా యూ టర్న్....

గంటా యూ టర్న్....

గంటా యూ టర్న్....
విజయవాడ, 
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఇటు గంటా పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉండటంతో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ గూటికి చేరిపోతారని సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. గంటా వెంట ముగ్గురు నలుగురు కాపు నేతలు కూడా పార్టీ మారడం ఖాయమని వార్తలొచ్చాయి. ఇదే క్రమంలో ఒకరిద్దరు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. గంటాతో పాటూ ఆయన వర్గం కూడా ఈ ప్రచారంపై స్పందించలేదు.. క్లారిటీ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే గంటా మాత్రం టీడీపీలో కొనసాగే అవకాశాలే మెరుగ్గా ఉన్నాయనే సంకేతాలు పంపించారు. మొన్నటి వరకు పార్టీ కార్యాలయం వైపు చూడని వ్యక్తి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి వెళ్లారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంతో పాటూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మొన్నటి వరకు పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరగడంతో.. దీనికి పుల్‌స్టాప్ పెడుతూ ఆయన పార్టీ కార్యాలయానికి రావడంతో తమ్ముళ్లు ఫుల్ ఖుషీలో ఉన్నారు.ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఖాయమయ్యాయి. ఈ నెల 10, 11న విశాఖ జిల్లా, 21, 22న శ్రీకాకుళం జిల్లాలో బాబు పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతంతో పాటూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. చంద్రబాబు గురువారం పర్యటనకు రానుండటంతోనే విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. గంటా కూడా హాజరయ్యారు. మరి చంద్రబాబు నిర్వహించే సమీక్షకు గంటా వెళతారా లేదా అన్నది చూడాలి. స్థానిక టీడీపీ నేతలు మాత్రం ఆయన కచ్చితంగా హాజరవుతారని చెబుతున్నారు

Related Posts