YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రభాస్‌ పోలీసా?... దొంగా?

ప్రభాస్‌ పోలీసా?... దొంగా?

‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను యాక్షన్‌‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో ప్రభాస్‌ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారట. ఆయన పాత్ర విలన్ షేడ్స్‌లో ఉంటుందని సమాచారం. ప్రభాస్‌ పోలీసు ముసుగులో ఉన్న దొంగా? లేక నిజాయతీ గల అధికారా?అనే విషయం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుందని తాజాగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ప్రభాస్‌ నిజంగా ఏ పాత్రలో కనిపించనున్నారో తెలియాలంటే చిత్ర బృందం చెప్పే వరకు వేచి చూడాల్సిందే.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ‘సాహో’ను నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ కథానాయికగా కనిపించనున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, అరుణ్‌ విజయ్‌, జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్‌ నిపుణులు పనిచేస్తుండటం విశేషం.

ఈ సినిమా కథలో శ్రద్ధా పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉందని, పాటలు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యేది కాదని ఇటీవల ప్రభాస్‌ మీడియాతో అన్నారు. ఆమె ఈ సినిమాకు సరైన ఎంపికని అభిప్రాయపడ్డారు. ‘సాహో’ యూనిట్‌ తదుపరి షెడ్యూల్‌ కోసం త్వరలోనే విదేశాలకు వెళ్లనుంది.

Related Posts