YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

నీలినీడలు (మహబూబ్ నగర్(

నీలినీడలు (మహబూబ్ నగర్(

నీలినీడలు (మహబూబ్ నగర్(
మహబూబ్ నగర్, : పాలమూరుకు సైనిక పాఠశాల మంజూరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సైనిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. దీంతో ఏడాది కిందటే నారాయణపేట పట్టణ శివారులోని ఎక్లాస్‌పూర్‌లో సైనిక పాఠశాల ఏర్పాటుకు జిల్లా అధికారులు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. 2018 మార్చి 13న రాష్ట్ర విద్యాశాఖకు ఈ మేరకు సమాచారం కూడా అందించారు. నోటిఫికేషను ఇస్తే స్థలానికి సంబంధించిన పత్రాలు అందజేస్తామనీ తెలిపారు. అయినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థల కేటాయింపుపై ఎలాంటి సమాచారం రాలేదు. వరంగల్‌కు మాత్రం గతేడాదే రూ.95 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నారాయణపేట దస్త్రాన్ని పెండింగులోనే ఉంచారు. వరంగల్‌లో 2021 నుంచి సైనిక పాఠశాల అందుబాటులోకి వచ్చేలా కావాల్సిన ప్రక్రియ అంతా పూర్తయింది. ఈ మేరకు కేంద్రం నుంచి అనుమతి కూడా వచ్చింది. పాలమూరుకు మంజూరైన సైనిక పాఠశాలపై మాత్రం సందిగ్ధం నెలకొంది. 2021 అక్టోబరు నుంచి వరంగల్‌ సైనిక్‌ స్కూలులో తరగతులు ప్రారంభం అవుతాయని ఇటీవల కేంద్రం ప్రకటించింది. నారాయణపేటకు మంజూరైన సైనిక పాఠశాల ప్రస్తావనే లేదు. ఈ నేపథ్యంలో అసలు నారాయణపేటకు సైనిక పాఠశాల వస్తుందో.. లేదోనన్న అనుమానాలు స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయి.వెనుకబడిన ప్రాంతమైన పాలమూరులో సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలని రెండేళ్ల కిందటే అప్పటి మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ పాఠశాలను నారాయణపేటలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలకు 50 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని రాష్ట్రాన్ని రక్షణశాఖ కోరింది. దీంతో జితేందర్‌రెడ్డి చొరవతో జిల్లా అధికారులు నారాయణపేటలోని ఎక్లాస్‌పూర్‌లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులు పంపించారు. నారాయణపేట దస్త్రం ముఖ్యమంత్రి వద్దే పెండింగులో ఉందంటూ అప్పటి నుంచి అధికారులు చెబుతూ వస్తున్నారు. మరోవైపు.. కేంద్రం నుంచి కూడా పాఠశాల ఏర్పాటుపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో సైనిక స్కూలు ప్రస్తావన క్రమంగా మరుగునపడిపోయింది. ఆర్నెల్ల కిందట జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ అన్ని పార్టీల అభ్యర్థులు తాము గెలిస్తే సైనిక పాఠశాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తెరాస అభ్యర్థిగా గెలిచిన ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల అనంతరం జరిగిన పలు కార్యాక్రమాల్లోనూ నారాయణపేటలో సైనిక స్కూలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై కేంద్రం, రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో పాలమూరుకు సైనిక పాఠశాల వస్తుందో.. లేదోనన్న అనుమానాలు రేకుత్తుతున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో రెండు, చిన్న రాష్ట్రాల్లో ఒకటి చొప్పున సైనిక పాఠశాలల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇదే క్రమంలో వరంగల్‌, పాలమూరు ప్రాంతాలను ఎంపికచేసి.. చివరకు వరంగల్‌కు మాత్రమే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, నారాయణపేటకు వచ్చే సైనిక పాఠశాలను పెండింగులో పెట్టారు. వరంగల్‌ సైనిక పాఠశాల తరగుతులు 2021 నుంచి ప్రారంభమవుుతాయని ప్రకటించడంతో నారాయణపేట ప్రస్తావన తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది.

Related Posts