YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

పనిభారం (కరీంనగర్)

పనిభారం (కరీంనగర్)

పనిభారం (కరీంనగర్)
కరీంనగర్, : సింగరేణిలో ఉద్యోగుల కొరత నెలకొంది. కీలక విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న వారితోనే పనులు చేయించుకోవాల్సి వస్తోంది. దీంతో పని భారం పెరుగుతోంది. కీలకమైన క్లరికల్‌, ట్రేడ్స్‌మెన్‌, మైనింగ్‌ సిబ్బందితో పాటు సంక్షేమాధికారులు, పీవోఏల కొరత తీవ్రంగా ఉంది. ఓవైపు ఉత్పత్తి సాధనలో కింది స్థాయిలో ఉండే పని చేసే మైనింగ్‌ సిబ్బంది, సంస్థ పరిపాలన విభాగంలో కీలకమైన క్లరికల్‌ సిబ్బంది కొరత కంపెనీలో వేధిస్తోంది. కాగా దీనికి పరిష్కారం మాత్రం చూపడం లేదు. అయిదేళ్ల కిందట క్లరికల్‌ సిబ్బందిని భారీ ఎత్తున నియమించినప్పటికీ ఇంకా 500 మంది వరకు కొరత ఉంది. 2014లో 450 మంది క్లరికల్‌ సిబ్బందిని నియమించారు. సింగరేణిలో సుమారు 3 వేల మంది వరకు క్లరికల్‌ సిబ్బంది పని చేశారు. ప్రస్తుతం వారంతా సీనియర్లు కావడంతో చాలా మంది ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం 1500 మంది వరకు మాత్రమే క్లరికల్‌ సిబ్బంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నియమితులైన 450 మందితో కలిసి మరో వేయి మంది మాత్రమే క్లరికల్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొత్తగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలో చేరిన వారు విద్యావంతులు కావడంతో వారిని క్లరికల్‌ విధులకు వినియోగించుకుంటున్నారు. బదిలీ వర్కర్‌ హోదాలో ఉద్యోగంలోకి తీసుకుంటున్న వారిని క్లరికల్‌ విధులకు వినియోగించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అదే విధంగా బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన మైనింగ్‌ సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది.
2020 నాటికి కింది స్థాయిలో సూపర్‌వైజర్లుగా పని చేసే మైనింగ్‌ సిబ్బంది చాలా మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఓవర్‌మెన్‌లు, మైనింగ్‌ సర్దార్‌లు, షార్టుఫైరర్‌లు ఎక్కువ మంది ఉద్యోగ విరమణ పొందే అవకాశం ఉంది. ఇప్పటికే సింగరేణిలో 800 మంది మైనింగ్‌ సిబ్బంది కొరత ఉంది. 2020 నాటికి సీనియర్‌లంతా ఉద్యోగ విరమణ పొందనుండటంతో కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. వీరితో పాటు సాంకేతికంగా కంపెనీలో సహకారం అందించే ట్రేడ్స్‌మెన్‌ల కొరత కూడా సింగరేణిలో ఎక్కువగానే ఉంది. గనుల్లో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ పనులకు సంబంధించిన ట్రేడ్స్‌మెన్‌లు సహకారం అందిస్తారు. ఈ విభాగంలో కూడా ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే గనులపై పీఓఏ, సంక్షేమాధికారులు సరిపడా లేకపోవడంతో వారు చేయాల్సిన పనులను ఇతరులతో చేయిస్తున్నారు. అధికారికంగా చేపట్టే పనులు సిబ్బంది కొరత కారణంగా ఇతర విభాగాలకు చెందిన వారిని వినియోగించుకుంటున్నారు.  సీనియర్లుగా పని చేస్తున్న వారి వద్ద జూనియర్లను నియమించడం ద్వారా పని నైపుణ్యం నేర్చుకునే అవకాశం ఉంది. ఉన్న సీనియర్‌లంతా వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ పొందనున్నారు. వారు పని చేస్తున్న సమయంలోనే కొత్త వారిని నియమిస్తే అనుభవాలను జూనియర్‌లకు చెప్పడంతో పాటు పని విధానం ఏ విధంగా ఉంటుందన్న దానిపై అవగాహన పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పూర్తిగా సీనియర్‌లు ఉద్యోగ విరమణ పొందే నాటికి కూడా కొత్త వారిని ఖాళీల్లో భర్తీ చేయకపోవడంతో కంపెనీలో పని నైపుణ్యం తగ్గే అవకాశం ఉంది. గనులపై వివిధ రకాల పనులుంటాయి. కార్మికుల సంక్షేమంలో భాగంగా పీఎఫ్‌, రుణాలు, ఆర్థిక ప్రయోజనాలు, సెలవులు, ఆర్జిత సెలవులు తదితర అంశాలపై సీనియర్‌ క్లరికల్‌ సిబ్బందికి అవగాహన ఉంటుంది. అలాగే ఆ గని పీఓఏకు కూడా పూర్తి స్థాయిలో అనుభవం ఉంటుంది. సీనియర్లున్న సమయంలోనే క్లరికల్‌ సిబ్బంది, పీఓఏలు కొత్త వారిని నియమిస్తే వారి వద్ద పనులు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సంక్షేమ అధికారుల విషయంలో కూడా యాజమాన్యం చొరవ తీసుకుని ఖాళీలను భర్తీ చేస్తే సంస్థకు మేలు చేకూరే అవకాశం ఉంది.

Related Posts