YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విచారణకు కోర్టు ధిక్కారణ కేసు..

Highlights

రంగనాథ్ పై కేసు విచారణ..

 విచారణకు కోర్టు ధిక్కారణ కేసు..

నేడు రంగనాథ్ పై విచారణకు రానున్న కోర్టు ధిక్కారణ కేసు

దేశచరిత్రలో తొలిసారిగా పిర్యాదు కన్నా ఒకరోజు ముందే ఎఫ్.ఐ.ఆర్. న్యాయస్థానానికి ఎలా చేరిందనే సంఘటనపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నల్గొండ ఎస్.పి. రంగనాథ్ తొలి ప్రతివాది. . ఈ కేసులో హైకోర్టు "జర్నలిస్ట్ అక్రమనిర్భంధం" వీడియో సి.డి. ని అడిగింది. అంతే కాకుండా ఈకేసులో తొమ్మిది ఘోరమైన తప్పిదాలను డాక్యుమెంట్ల రూపంలో పకడ్భందీగా బాధితులు కేసులో ప్రస్థావించారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణకు జరగనున్నది. ఈ పోలీసు అధికారులు వ్యక్తిగత హోదాలో హాజరయ్యే విధంగా ఈ కేసు దాఖలు అయింది. రంగనాథ్ తో పాటు నాటి సి.ఐ. నేడు ఉట్నూరు ఏ.సి.పి.గా ఉన్న వెంకటేష్, ఏ.ఎస్.ఐ. నరసింహారావు ప్రతివాదులుగా ఉన్నారు. *వాదించడాననికి ప్రభుత్వ న్యాయవాది అనాసక్తి.:* సహజంగా హైకోర్టు లో ఏ కేసు వేసిన ప్రభుత్వం తరఫున న్యాయవాది పేరు తప్పక ఉంటుంది. ఈ కేసులో మాత్రం ప్రభుత్వ న్యాయవాది అనాసక్తి చూపుతున్నారు. పిర్యాదు కన్నా 24 గంటలకు ముందే ఎఫ్.ఐ.ఆర్. నమోదు కావడం, అది న్యాయస్థానం రికార్డులలో ఉండటం ఒక కారణం. కాగా మరోవైపు హైకోర్టు న్యాయ విచారణకు ఆదేశించడంతో 'ఎవరో చేసిన ఘోర తప్పిదాలకు తాను సమాధానం చెప్పడం కంటే .. దూరంగా ఉండటం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. *కొత్త సంవత్సరంలో తీపికబురు: పాశం మరో రెండు నెలల్లో మరో 'తీపికబురు' బాధితులకు అందే అవకాశం ఉందని ఈ కేసు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ పాశం కృష్ణారెడ్డి చెప్పారు.

Related Posts