YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆస్తి-పాస్తులు విదేశీయం

కాలిఫోర్నియాలో కార్చిచ్చు

కాలిఫోర్నియాలో కార్చిచ్చు

కాలిఫోర్నియాలో కార్చిచ్చు
లాస్ ఏంజిల్స్, అక్టోబర్ 30  
కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు హాలీవుడ్ తారలను రోడ్డున పడేలా చేసింది. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు పెట్టేలా చేసింది. లాస్ ఏంజిల్స్‌లో అటవీ ప్రాంతాన్ని అనుకుని ఉన్న అత్యంత ఖరీదైన నివాసాలకూ మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ నివసిస్తున్న సంపన్నులు, హాలీవుడ్ నటులు అర్ధరాత్రి బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది.బ్రెంట్‌వుడ్‌గా పేరొందిన ఈ ప్రాంతంలో హాలీవుడ్ నటులతోపాటు భారీ నిర్మాతలు, దర్శకులు, మీడియా సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారులు నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యున్నతవర్గాలు నివసించే ప్రాంతంగా బ్రెంట్‌వుడ్‌కు పేరుంది. ఈ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘తెల్లవారుజాము 3.30 గంటలకు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశాం. మీరు కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లయితే.. వేరే ఆలోచనలేవీ చేయకండి. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి. ప్రపంచంలోనే గొప్ప ఫైర్ ఫైటర్లు మనకు ఉన్నారు. ప్రమాదంతో పోరాడి తమ కాలిఫోర్నియా ప్రజలను కాపాడే నిజమైన హీరోలు వారు’’ అని తెలిపారు.ఆర్నాల్డ్ నటించిన ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ సినిమా సోమవారం రాత్రి కాలిఫోర్నియాలో విడుదల చేయాల్సి ఉండేది. అయితే, కార్చిచ్చు వల్ల సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా ‘పారామౌంట్ పిక్చర్స్’ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ చిత్రాన్ని హాలీవుడ్ (ఫిల్మ్‌సిటీ)లో ప్రదర్శిస్తున్నామని ప్రకటించింది. కార్చిచ్చు బాధితుల కోసం అక్కడ రెడ్ క్రాస్ సంస్థ వసతి, ఆహార సదుపాయాలు కల్పించనుందని పేర్కొంది. ఈ ప్రాంతంలో ఏయే నటీనటులు, సినీ ప్రముఖలు తమ ఇళ్లను కోల్పోయారనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది

Related Posts