YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం తెలంగాణ

మా కాలనీలో మద్యం దుకాణం    వద్దు ఆసిఫాబాద్  

మా కాలనీలో మద్యం దుకాణం    వద్దు ఆసిఫాబాద్  

మా కాలనీలో మద్యం దుకాణం    వద్దు
ఆసిఫాబాద్  అక్టోబర్ 30 
కౌటాల మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన మద్యం దుకాణాల ఏర్పాటు వివాదస్పదంగా మారుతుంది. ఎక్సైజ్ అధికారులు, మద్యం దుకాణాల నిర్వాహకుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ మద్యం  పాలసీ ప్రకారం కౌటాల మండల కేంద్రంలో రెండు మద్యం దుకాణాలు మంజూరయ్యాయి. గతంలో మద్యం దుకాణం నిర్వహించిన చోట ప్రజల నుంచి అభ్యంతరాలు  వ్యక్తం కావడంతో నిబంధనలను అనుసరించి మరో చోట ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే మద్యం దుకాణాలు ఏర్పాటు కోసం అధికారులు సూచించిన భవనాలపై సైతం ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఎక్సైజ్ అధికారులు భవనాలను పరిశీలించారు. ప్రజలకు కలిగే ఇబ్బందులను వారికి తెలియజేశారు. మండల కేంద్రంలోని మొగడ్ ధగడ్, చౌరస్తాలో నీ   పోచమ్మ ఆలయం సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ పలువురు గ్రామపంచాయతీ లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటే ఇదే స్థలంలో మొగడ్ ధగడ్, వీర్దండే, గుండ్రాయి పేట,  తమ్ముడేట్, మండల కేంద్రం లోని  భారీ వాడ , బీసీ కాలనీలో చదువుకున్న విద్యార్థులు ఆటోలు బస్సుల కోసం వేచి చూస్తుంటారు. ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని  ఫిర్యాదు దారుల వాదన. ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయిన నేపథ్యంలో గతంలో ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మద్యం దుకాణాలను జనావాస లో ఏర్పాటు చేయవద్దంటూ తీర్మానం చేశారు. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు 

Related Posts