YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్న జగన్‌ ప్రభుత్వం   ఆన్‌లైన్లో నిల్‌... ఆఫ్‌ లైన్లో ఫుల్‌  నిరసన దీక్షలో ధ్వజమెత్తిన టీడీపీ నాయకులు రాజమహేంద్రవరం

ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్న జగన్‌ ప్రభుత్వం   ఆన్‌లైన్లో నిల్‌... ఆఫ్‌ లైన్లో ఫుల్‌  నిరసన దీక్షలో ధ్వజమెత్తిన టీడీపీ నాయకులు రాజమహేంద్రవరం

ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్న జగన్‌ ప్రభుత్వం  ఆన్‌లైన్లో నిల్‌... ఆఫ్‌ లైన్లో ఫుల్‌
 నిరసన దీక్షలో ధ్వజమెత్తిన టీడీపీ నాయకులు
రాజమహేంద్రవరం  అక్టోబర్ 30
;ఇసుక సరఫరా విషయంలో వైఎస్సార్‌ ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి ఇటు కార్మికులు... అటు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని, ఇసుక సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని తెలియచేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు. రాజన్న పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి జగన్‌ పాలనను పక్కన పెట్టేసి కార్మికుల కడుపు మాడ్చే పనిలో మాత్రం నిమగ్నమయ్యారని మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజమహేంద్రవరం కోటగుమ్మం వద్ద రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన నాయకులు బుధవారం ఒక రోజు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక.. పస్తులుంటూ ఉరి వేసుకోవడమే శరణ్యమన్నట్టుగా ప్రదర్శన చేశారు. బుర్రకథ కళాకారులు వైసిపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా కార్మికుల ఆత్మహత్యలు నివారించాలి.. కార్మికుల ఆకలి మంటలు తీర్చాలి అనే నినాదంతో జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌, గుడా మాజీ ఛైర్మన్‌ గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌ చల్లా శంకర్రావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు,  నగర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, రూరల్‌ నియోజకవర్గ నాయకులు మార్ని వాసుదేవరావు, మార్గాని సత్యనారాయణ, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, చాంబర్‌ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఇసుక ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుకను అందుబాటులోకి తెచ్చేవరకు భవన నిర్మాణ కార్మికులకు కరువు భత్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా నూతన ఇసుక పాలసీ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనిట్‌ ఇసుక ధరను తగ్గించడటంతో పాటు పనుల్లేక ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న భవన నిర్మాణ రంగం కార్మికులకు ఐదు నెలల జీవన భృతిని నెలకు 10 వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పనుల్లేక ఆత్మహత్యకు పాల్పడిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ, అనుబంధ కార్మికులు రోడ్డున పడినా ముఖ్యమంత్రి జగన్‌ తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇసుక దొరకక...పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ఇసుక వారోత్సవాలు జగన్‌కొత్త నాటకానికి తెరతీసారని ధ్వజమెత్తారు. ఇటువంటి ముదనష్టపు నిర్ణయాల కారణంగా ప్రజలు మరింతగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తెచ్చేవరకు తెలుగుదేశం పార్టీ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఏరోజు కారోజు రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కానీ... కడుపులోకి నాలుగు మెతుకులు వెళ్లని భవన నిర్మాణ కార్మికులు, ఇసుకపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులను జగన్‌ ప్రభుత్వం రోడ్డున పడేసిందని, ఇటీవల అన్న కోసం దొంగతనం చేసిన ఒక కార్మికుడు... మూడు రోజుల క్రితం ఆత్మ హత్య చేసుకున్న భవన నిర్మాణ రంగ కార్మికుడి మరణమే అందుకు నిదర్శనమన్నారు. వారిని హత్య చేసింది రాష్ట్ర ప్రభుత్వమే దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న 30 లక్షల కుటుంబాల బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయన్నారు. ఇసుక మాఫియాకు చెక్‌ పెడతామని ప్రభుత్వం ఒక పక్క చెబుతోందని, అయితే ఆ పార్టీకి చెందిన నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తూ అధికారులపై దాడులకు తెగబడుతున్నారు... దానిని అరికట్టాలి డిమాండ్‌ చేశారు. కాగా టీడీపీ చేపట్టిన ఉద్యమానికి జనసేన రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కందుల లక్ష్మీదుర్గేష్‌ ప్రసాద్‌, అనుశ్రీ సత్యనారాయణ, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాస్‌, బుడ్డిగ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో క్రెడాయ్‌ సభ్యులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌ మూర్తి, వివిధ కార్మిక సంఘాలు పలు కార్మిక సంఘాల నాయకులు మద్ధతు పలికారు. అనంతరం నిరసన దీక్షా శిబిరం నుంచి ర్యాలీగా బయలుదేరి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం చేరుకుని సబ్‌ కలెక్టర్‌ను కలిసి డిమాండ్లుతో కూడిన వినతి పత్రం అందచేశారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల ఇన్‌ఛార్జులు, ప్రెసిడెంట్లు, వివిధ కార్మిక సంఘాల నేతలు, రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల టీడీపీ నాయకులు, రాజమండ్రి భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం, ఎన్‌టిఆర్‌ పెయింట్‌ యూనియన్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌, తాపి పని వార్ల సంఘం, ఇసుక పని వార్ల సంఘం, వివిధ సంఘాల కార్మికులు, అధిక సంఖ్యలో టీడీపీ అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts