YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

అమ్మ ఒడి పధకం కింద ఏటా 15 వేలు గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబులు మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు

Highlights

అమ్మ ఒడి పధకం కింద ఏటా 15 వేలు
గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబులు
మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు
అమరావతిఅక్టోబర్ 30,
బుధవారం అమరావతి లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. రెట్టింపు పోషకాహారం అందించే పైలెట్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 77 మండలాల్లో రూ. 90 కోట్లతో పథకం ఈ పథకం అమలుచేయాలని కూడా కేబినెట్లో నిర్ణయం జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పెర్ని నాని మీడియాకు వివరించారు.  కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి భూములు కేటాయింపును రద్దుచేయాలని కుడా  ఏపీ కేబినెట్ నిర్ణయించింది  గ్రామీణ నియోజక వర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని, ఎరువులు ల్యాబ్లో పరిక్షించిన తర్వాతనే రైతులను పంపిణీ చేయాలని మంత్రివర్గం  నిర్ణయించింది. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి పథకం వర్తింప చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. అమ్మ ఒడి పధకం కింద ఏటా 15 వేలు ఇవ్వనున్నట్టు మంత్రి  తెలిపారు.  అమ్మ ఒడి కోసం తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలన్నారు. జనవరి నుంచి తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తామన్నారు. టీటీడీ మినహ దేవాలయాల్లో బోర్డు సభ్యుల నియామకం కోసం చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోబో శాండ్ తయారీ యంత్రాల కొనుగోలుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వాళ్లకు రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. 300 అడుగుల వరకూ రూ.1కే రెగ్యులరైజేషన్కు నిర్ణయించామన్నారు. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న వాళ్లకు 300 గజాల వరకూ మార్కెట్ విలువను బట్టి రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. రెగ్యులరైజ్ చేసిన భూములకు ఐదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 395 లైన్మన్ పోస్టుల భర్తీకి, హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

అమ్మ ఒడి పధకం కింద ఏటా 15 వేలు గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబులు మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు

Related Posts