YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆస్తి-పాస్తులు తెలంగాణ

నిర్వహాణ వ్యయంతోటే ఆర్టీసీకి నష్టం

నిర్వహాణ వ్యయంతోటే ఆర్టీసీకి నష్టం

నిర్వహాణ వ్యయంతోటే ఆర్టీసీకి నష్టం
హైదరాబాద్  నవంబర్ 1  
ఆర్ధిక స్థితిగతులపై ఆర్టీసీ  యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము రూ.644.51 కోట్లు రావాల్సి ఉండగా, మొత్తం సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్లో బస్సులు నడుపుతున్నందుకు రూ.1786.06 కోట్లు చెల్లించాలని జీహెచ్ఎంసీకి ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.  2015-16, 2016-17లో కలిపి రెండేళ్లలో జీహెచ్ఎంసీ 336.40 కోట్లు విడుదల చేసింది. మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని ఆఫిడవిట్ లో పేర్కోంది. జీహెచ్ఎంసీ చట్ట నిబంధనల ప్రకారం సెక్షన్ 112(30) ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్ఎంసీ అంగీకరించలేదు. అందువల్ల జీహెచ్ఎంసీ నుంచి రావాల్సినవి బకాయిలుగా పరిగణించరాదు. ఆర్టీసీలో నిర్వహణ, డీజిల్ భారం ఎక్కువగా ఉంటోంది.  నిర్వహణ వ్యయం వల్లే నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. ప్రభుత్వ సాయం అందుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సమ్మె ప్రారంభమైన అక్టోబరు 5 నుంచి 30వ తేదీ వరకు బస్సుల ద్వారా సంస్థ రూ.78 కోట్లు ఆర్జించగా, ఇదే కాలానికి రూ.160 కోట్లు వ్యయమైంది. రూ.82 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కోంది.

Related Posts