YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

అడవి బిడ్డల సేవలో.. (విజయనగరం)

అడవి బిడ్డల సేవలో.. (విజయనగరం)

అడవి బిడ్డల సేవలో.. (విజయనగరం)
విజయనగరం, నవంబర్ 02 : రాష్ట్రంలో గిరిజన సంక్షేమంలో అమలవుతున్న ఎన్నో పథకాలకు పార్వతీపురం ఐటీడీఏ మార్గసూచీగా ఉంది. తాజాగా గిరిజన ప్రాంతంలో పిల్లలు, గర్భిణులు ఆరోగ్యం మెరుగుపరిచేందుకు వీలుగా ప్రతిపాదించిన వైద్య పరీక్షల ఆలోచనకు కూడా ఇక్కడే అంకురార్పణ జరిగింది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి గత పీవో చేపట్టిన కార్యక్రమం ఆదివాసీ ఆరోగ్యం కార్యక్రమం రాష్ట్రమంతటా అమలు చేశారు. ఫలితంగా సికెల్‌సెల్‌ ఎనీమియా, తలసేమియా, రక్తహీనత వంటి వ్యాధులపై సమరం చేసే కార్యాచరణ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎనిమిది లక్షల మందికి పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రతిపాదించింది. ఇది ఇప్పటికే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. సికెల్‌సెల్‌ ఎనీమియా వ్యాధిగ్రస్థులు ఏజెన్సీలో ఎక్కువ మంది ఉంటున్నారనే కారణంగా ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచనలు జారీచేస్తుండేది. కానీ ఎప్పుడు దీన్ని అంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదు. గిరిజన విద్యార్థులు ఉన్నట్లుండి మృత్యువాత పడడానికి కారణాలను అన్వేషిస్తే రక్తహీనత కారణంగా తేలింది. దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది నుంచి రక్తహీనతను నిర్ధారించే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. ఉప ప్రణాళిక ప్రాంతంలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలందరికీ శిక్షణ ఇచ్చారు. దీంతో సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులు తెలిసి వచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థులు, గర్భిణులను లక్ష్యంగా తీసుకోగా, ప్రాథమికంగా పార్వతీపురం ఉపప్రణాళిక ప్రాంతంలో 18,675 మంది విద్యార్థులను లక్ష్యంగా తీసుకున్నారు. వీరికి అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహించారు. వీరిలో 122 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. 23 మంది విద్యార్థులు సికెల్‌సెల్‌ ఎనీమియా అనే  తీవ్ర రక్తహీనత వ్యాధితో ఉన్నట్లు నిర్ధారించారు. 122 మందిని లక్షిత వర్గంగా తీసుకొని వైద్యసేవలు అందిస్తున్నారు. మరో ముగ్గురు పిల్లలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. గర్భిణుల్లో రక్తహీతను అధిగమించేందుకు పార్వతీపురం ఐసీడీఎస్‌లో ఐదునూర్లు పథకాన్ని అమలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకున్న ప్రతి గర్భిణికి వందరోజుల పాటు గుడ్లు, పాలు, ఐరన్‌ మాత్రలు, పండు, పల్లీ పట్టీ, కాల్షియం మాత్రలు అందించే పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఫలితాలను బట్టి అన్నిచోట్ల అమలు చేస్తామని భావించారు. కానీ ఇప్పటికీ ఈదిశగా అమలు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం సమ్మతి తెలిపితే పార్వతీపురం ఐటీడీఏలో ప్రాథమికంగా అమలుచేస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే అవకాశముంది. తీవ్ర రక్తహీనతకు కారణమవుతున్న సికెల్‌సెల్‌ ఎనీమియా, తలసేమియా వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించేందుకు రూ.3.12 లక్షలు కేటాయించారు. బాలల ఆరోగ్య అంశాలను జిల్లాస్థాయిలో పర్యవేక్షించే వైద్య యంత్రాంగానికి ఈ నిధులను అందించారు. మూడు రకాల ఇంజక్షన్లను అందించేందుకు సిద్ధం చేశారు.

Related Posts