YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చంద్రబాబుకు ములాయం,మమతాలు బాసట 

Highlights

  •  అవిశ్వాస తీర్మానానికి ములాయం మద్దతు 
  • ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడాన్ని స్వాగతించిన మమతా బెనర్జీ
  • అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం 
చంద్రబాబుకు ములాయం,మమతాలు బాసట 


కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ప్రకటిస్తున్నట్టు ములాయం పేర్కొన్నట్టు తెలుస్తోంది.ఈ మేరకు చంద్రబాబుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో పాటుగా  పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ  ఫోన్ చేసినట్టు సమాచారం. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడాన్ని స్వాగతిస్తున్నామని, విపత్తు నుంచి దేశాన్ని కాపాడటానికి  ఈ చర్యలు దోహదం చేస్తాయని చంద్రబాబుతో మమతా బెనర్జీ అన్నట్టు సమచారం.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ, తమకు మద్దతుగా ఇతర పార్టీలను కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఎంపీల మద్దతు కోరుతూ వారి సంతకాలు తీసుకునే పనిలో టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఇప్పటివరకు నలభై మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా  అవిశ్వాస తీర్మానం నోటీసుపై  సంతకం చేశారు.ఇదిలా ఉండగా కేంద్రంపై టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇరవై విపక్ష పార్టీలతో కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే, ఆజాద్, జ్యోతిరాదిత్య సింథియా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. 
.

Every state has their own problems and issues. TDP also has its own issues, initially they were with the NDA & now they have left the NDA for a better cause. So whatever TDP has decided is correct: Mamata Banerjee, West Bengal Chief Minister pic.twitter.com/gmdtLqsb3B

— ANI (@ANI) March 16, 2018

Related Posts