YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆస్తి-పాస్తులు తెలంగాణ

 సక్రమంగా ఆన్ లైన్ లో భూరికార్డులు

 సక్రమంగా ఆన్ లైన్ లో భూరికార్డులు

 సక్రమంగా ఆన్ లైన్ లో భూరికార్డులు
ఏలూరు, నవంబర్ 04,(న్యూస్ పల్స్):
భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వని రీతిలో వివరాలు అన్ లైన్ లో సక్రమంగా నమోదు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిని  స్పందన కార్యక్రమానికి  జిల్లా నలుమూలల నుండి అనేక మంది ప్రజలు వచ్చి కలెక్టర్ కు అర్జీలు  సమర్పించారు.  ప్రతివారం ఎక్కువ  సంఖ్యలో  ప్రజలు వస్తూండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు  కల్సించారు. ఇళ్లస్థల పట్టాలు, పింఛనులు, రేషన్ కార్డుల కోసం వచ్చే వారికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా టెంట్ లు, కుర్చీలు, మంచి సౌకర్యం ఏర్పాటు చేయడంలో అర్జీదారులు సేదతీర్చుకుంటూ ఆలస్యమైనా ఎటువంటి అసహనానికి లోనుకుండా తమ అర్జీలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల నుండి రశీదులు తీసుకుని తమ గమ్యస్థానాలకు వెళుతున్నారు.
ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలిస్తూ రైతు బరోసా సొమ్ములు అందాలంటే భూమి వివరాల నమోదు సక్రమంగా  ఉండాలన్నారు. వచ్చే అర్జీలలో భూముల సర్వే వివరాలు వెంబ్ ల్యాండ్ అడంగల్ లో అసలు నమోదు కాకపోవడం, తప్పుగా నమోదు కావడం, అసలు యజమానుల వేరున కాకుండా వేరే వ్యక్తుల పురున నమోదు కావడం వంటి సమస్యల పై వస్తున్నాయని, అధికారులు ప్రతి అర్జీన క్షుణ్ణంగా పరిశీలించి సక్రమంగా పరిష్కరించాలని అసలైన యజమానులకు ఎటువంటి  ఇబ్బందులు ఎదురవ్వని విధంగా ఆన్ లైన్ నమోదు చేయాలని  కలెక్టర్ అదేశించారు. చదువురాని ఏమితెలియని అమాయక పేదరైతులు వుంటారని వారు పదే పదే అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టు తిరగడం వల్ల వారి పనులకు అంతరాయం కలుగడమే కాకుండా ఎంటో సొమ్ము వృదా అవుతుందని ఈ విషయం అధికారులు దృష్టి పెట్టుకుని సేవాదృక్పదంతో పనిచేయాలన్నారు. పనులు చేయడం పేద ప్రజలకు ప్రజలకు సేవచేసే అవకాశం గా అధికారులు గుర్తించాలన్నారు. పెదపాడు మండలం వేంపాడు గ్రామానికి చెందిన పామర్తి కృష్ణారావు అర్జీ సమర్పిస్తూ ఆర్ నెం 120/1,120/2,120/3, లలోగల తన భూమి వివరాలు అన్ లైన్ వెబ్ ల్యాంగ్  అడంగల్ లో నమోదు కాలేదన్నారు. మీసేవకు వెళితే ఈ సర్వే నెంబర్లు అన్ లైన్ లో లేవని చెపుతున్నారని కలెక్టర్ దృష్టి కి తీసుకువెళ్లారు. పెదవేగి నుండి కూచిపూడి  గ్రామానికి వెళ్లేరోడ్డులో ఆర్ ఎస్ నెం.597/7 లో వున్న య2.23 సెంట్ల ప్రభుత్వ భూమిలో కొంత స్థలం సంఘనికి వేబ్రిడ్జి,  పెట్రోల్ బంక్ నిర్మాణానికి కేటాయించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్  ఎం. వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్, ఆర్ డి ఒ శిననారాయణ రెడ్డి, రేణుక, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రంగలక్ష్మి దేవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Related Posts