
జీన్స్ వేసుకుంటే అనేక రకమైన ఆరోగ్యసమస్యలు
ప్రతి 100 మందిలో 10 మంది చర్మ సంబంధిత వ్యాధిగస్త్రులు
నూతన సాంకేతిక విజ్ఞానం సదస్సులోవైద్యులు
విజయవాడ నవంబర్ 4 :
జీన్స్ ప్రస్తుత ప్రపంచం లో అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ ఇప్పుడు ఒక సంచలనం. ఈ జీన్స్ ని చిన్నపిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఉపయోగిస్తున్నారు. వేసుకోవడానికి ఈజీగా చూడటానికి అందంగా ఉండటం తో యువత వీటివైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనితో రకరకాలైన సమస్యలు వచ్చి పడుతున్నారు. జీన్స్ వేసుకోవడం వల్ల గజ్జి తామర వంటి వ్యాధులు వస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. అలాగే మగవారు బిగుతుగా ఉండే జీన్స్ వేసుకోవడం వల్ల అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి. తాజాగా దీనిపై విజయవాడలో వ్యాధుల నియంత్రణ - నూతన సాంకేతిక విజ్ఞానం పై ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యువతి యువకులు జీన్స్ వేసుకోవడం వల్ల వచ్చే కొన్ని సమస్యల గురించి వారు వివరించారు. ముఖ్యంగా పిల్లల వస్త్రధారణ పై తల్లిదండ్రులు శ్రద్ద వహించాలని తెలిపారు. దీనిపై డాక్టర్స్ బృందం మాట్లాడుతూ .. జీన్స్ ప్యాంట్ ని కొన్ని రోజులపాటు ఉతక్కపోయినా వేసుకోవచ్చు అలాగే ఒకసారి కొంటె రెండు మూడేళ్ళ పాటు పనిజరుగుతాయి అనే ఉద్దేశం తో యువత వీటికి ఆకర్షితులౌతున్నారు అని చెప్పారు. జీన్స్ వేసుకుంటే చాలా బిగుతుగా ఉండటం తో గాలి ఆడక చర్య సమస్యలు వస్తున్నాయని ప్రతి 100 మందిలో 10 మంది చర్మ సంబంధిత వ్యాధిగస్త్రులు ఉన్నారంటూ తెలిపారు. ముఖ్యంగా ఈ సమస్య స్కూల్స్ కి వెళ్ళేవారిలో ఎక్కువగా ఉంది అని స్కూల్ లో ఎక్కువమంది మధ్య ఇరుకురుకుగా కూర్చోవడం వల్ల అలాగే స్కూల్ కి వెళ్లి వచ్చిన తరువాత సరిగా స్నానం చేయకపోవడం వల్ల కూడా ఈ చర్మ సమస్యలు ఎక్కువైయ్యాయి అని తెలిపారు. దీనితో మగవారిలో మర్మాంగం. ఆడపిల్లల్లో జననాంగం వద్ద ఇన్ ఫెక్షన్స్ వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే .. జీన్స్ ని సరిగ్గా ఉతకడం ఆరబెట్టిన తరువాత ఇస్త్రీ చేయడం సందర్భాన్ని బట్టి ..రోజుకి 2 3 సార్లు స్నానం చేయడం ద్వారా చర్మ వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు.