YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి ఆస్తి-పాస్తులు తెలంగాణ

ల్యాండ్ పూలింగ్ కోసం దరాఖాస్తులు పంపండి

ల్యాండ్ పూలింగ్ కోసం దరాఖాస్తులు పంపండి

ల్యాండ్ పూలింగ్ కోసం దరాఖాస్తులు పంపండి
హైదరాబాద్ నవంబర్ 7,   
హెచ్ఎండిఏ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ మండలం ప్రతాప సింగారం, కొర్రెముల గ్రామాలలో 1,575 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లోని మోకిల్లాలో  456 ఎకరాల్లో లే అవుట్ లను ల్యాండ్ పూలింగ్ పథకంలో భాగంగా ఫేజ్-1 లో అభివృద్ధి చేయాలని హెచ్ఎండిఏ ప్రతిపాధించిందని, భూయజమానులు తమ సమ్మతి పత్రాలను అందజేసి ఇందులో పాల్గొనాలని హెచ్ఎండిఏ కమీషనర్  అర్వింద్ కుమార్ కోరారు. హెచ్ఎండిఏ ప్రాంతంలో ప్రణాళికాపరమైన అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పథకం, ఏరియా డెవలప్ మెంట్ ప్లాన్, డెవలప్ మెంట్ స్కీం ను ఆమోదించిందన్నారు.  ఈ విషయంపై ఈ ఏడాది మే 2 న, జూన్ 16న ల్యాండ్ పూలింగ్ కోసం ఆసక్తి ఉన్న భూయజమానుల నుండి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్లను హెచ్ఎండిఏ జారీ చేసింది. ఉప్పల్ భగాయత్ తరహాలో హెచ్ఎండిఏ పరిధిలో లే అవుట్లు వేసి అభివృద్ధి చేస్తారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం సేకరించిన భూమిని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తారు. ల్యాండ్ పూలింగ్ పథకంలో భూయజమానులు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే అవకాశం కలుగుతుంది. ప్రతిపాధించిన ప్రాంతంలో అంగీకరించిన భూయజమానుల రైతుల భూములను అభివృద్ధి చేయడంలో హెచ్ఎండిఏ ఫెసిలిటేటర్ గా పనిచేస్తుంది.

Related Posts