YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం 

Highlights

  • ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్లీనరీ
  • పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ ప్రారంభోపన్యాసం
  • కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా, మన్మోహన్‌
  • ఏఐసీసీ, పీసీపీ ప్రతినిధులు, కార్యకర్తలు
కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం 

వచ్చే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్‌ పార్టీ అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలు, భవిష్యత్‌ కార్యాచరణకు పార్టీ సీనియర్‌ నేతలు తొలిరోజు తుది రూపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భావ సారుప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని రాజకీయ తీర్మానంలో పొందుపర్చారు.ఏఐసీసీ, పీసీపీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనే నేటి ప్లీనరీని ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ ప్రారంభోపన్యాసం చేస్తారు.

ప్లీనరీలో నేతల కంటే కార్యకర్తలపైనే ఎక్కువ దృష్టి పెడతామని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించగా.. నేటి సమావేశంలో కార్యకర్తలు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనున్నారు.ప్రస్తుత రాజకీయ తీర్మానంతో పాటు వ్యవసాయం, ఉద్యోగాలు, పేదరిక నిర్మూలనపై మరొక తీర్మానాన్ని ఆమోదిస్తారు. పార్టీకి దిశానిర్దేశం చేయడంతో పాటు మోదీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఈ సమావేశాల్లో ప్రధానంగా ఎండగడతారని తెలుస్తోంది. అలాగే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసేలా ఈ ప్లీనరీని వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్లీనరీలో సోనియా గాంధీ కూడా ప్రసంగిస్తారని సమాచారం. శుక్రవారం  రాహుల్‌ నేృతృత్వంలో జరిగిన సబ్జెక్ట్స్‌ కమిటీ సమావేశంలో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సహా సీనియర్‌ నేతలతో పాటు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా, మన్మోహన్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో అనేక సలహాలు, సూచనలు వచ్చాయని, తీర్మానాల్లో వాటిని పొందుపర్చాలని కమిటీల చైర్మన్లను రాహుల్‌ గాంధీ ఆదేశించారని పార్టీ తెలిపింది.

 
 

Related Posts