YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఓ ప్రధాని హామీలను విస్మరించిన ఎన్డీయే 

Highlights

  • పీకి ప్రత్యేక హోదాపై తీర్మానం
  • విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తాం  
  • కాంగ్రెస్ ప్లీనరీలో  రాహుల్
ఓ ప్రధాని హామీలను విస్మరించిన ఎన్డీయే 

ఒక ప్రధాని ఇచ్చిన హామీలను కూడా ఎన్డీయే విస్మరించిందని ఏఐసిసి జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీ సమావేశాలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఏపీకి స్పెషల్ స్టేటస్ తో పాటు... విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు.ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లీనరీలో తీర్మానం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తుందని చెప్పారు. బీజేపీ నేతలు కోపాన్ని ఉపయోగిస్తే, తాము మాత్రం ప్రేమతో పని చేస్తున్నామని తెలిపారు. యావత్ దేశం అసంతృప్తితో ఉందని అన్నారు.దేశాన్ని ఐక్యంగా ఉంచి, ముందుకు నడిపించేది హస్తం గుర్తేనని చెప్పారు.ఎన్డీయే పాలనలో యువత ఆగ్రహంతో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని అన్నారు. ఈ దేశం ప్రజలందరిదని... అన్ని కులాలు, అన్ని మతాలవారిదని చెప్పారు.

Related Posts