YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఇసుక కోరతపై టీడీపీ ఛార్జ్ షీట్ 

ఇసుక కోరతపై టీడీపీ ఛార్జ్ షీట్ 

ఇసుక కోరతపై టీడీపీ ఛార్జ్ షీట్ 
విజయవాడ నవంబర్ 12
రాష్ట్రంలో ఇసుక దోపిడీ పై  టీడీపీ నేతలు మంగళవారం ఛార్జ్ షీట్  విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు,  చిన రాజప్ప, దేవినేని ఉమ, కాల్వ శ్రీనివాసులు, అఖిల ప్రియ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బోండా ఉమ, వర్ల రామయ్య తదితరులు పాల్గోన్నారు.  చార్జీసీట్ లో జిల్లాల వారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల పేర్ల జాబితాను ప్రకటించారు. 13 జిల్లాల్లో 60 మంది వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా, పార్థ సారధి, ఉదయభాను, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రోజా, పెద్ది రెడ్డి, వారి అనుచరులకు ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని వారు ఆరోపించారు. వైసీపీ నేతలు ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు. ఎన్నడూ రాని ఇసుక కొరత ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి చోటా వైసీపీ నేతల ప్రమేయంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని దుయ్యబట్టారు. ఇసుక కృత్రిమ కొరతపై ఈనెల 14న చంద్రబాబు దీక్ష చేపడతారని తెలిపారు. అచ్చేనాయుడు మాట్లాడుతూ తెలంగాణ లో ఆర్టీసీ సమ్మెకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. చంద్రబాబు దీక్షకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరుతున్నామని అన్నారు. 

Related Posts