YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సింగపూర్

అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సింగపూర్

అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సింగపూర్
విజయవాడ నవంబర్ 12 
: అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ముందుకు వెళ్ళోద్దని కోరిందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. ‘గతంలో 6.84 కిలో చదరపు కిలో మీటర్లు రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ద్వారా సింగపూర్ కన్సార్టియం 2017లో ఏర్పడింది. ఈ ప్రాజెక్టును రద్దు చేసుకోవడం కొన్ని మిలియన్ డాలర్ల మేర మాత్రమే ప్రభావం చూపుతుందని కన్సార్టియం కంపెనీలు చెపుతున్నాయి. అయితే ఇండియాలో తమ పెట్టుబడులపై దీని ప్రభావం ఏమీ ఉండదని సింగపూర్ కన్సార్టియం కంపెనీలు చెపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలపట్ల సింగపూర్ కంపెనీలు ఇకపై కూడా ఆసక్తి కనబరుస్తాయి. ఇండియా ఓ అద్బుతమైన అవకాశాలు కలిగిన అతిపెద్ద మార్కెట్‌గా నేటికి మేం భావిస్తున్నాం’ అని ప్రకటనలో మంత్రి ఈశ్వరన్ స్పష్టం చేశారు. కాగా..మొత్తం 1691 ఎకరాల్లో మూడు దశల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేలా గత ప్రభుత్వం సింగపూర్ సర్కార్‌తో ఒప్పందం చేసుకున్న విషయం విదితమే.

Related Posts