YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

మంత్రి కేటీఆర్ హామీతో విధులకు రెవెన్యూ ఉద్యోగులు

మంత్రి కేటీఆర్ హామీతో విధులకు రెవెన్యూ ఉద్యోగులు

మంత్రి కేటీఆర్ హామీతో విధులకు రెవెన్యూ ఉద్యోగులు
జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ( ట్రైసా)
జగిత్యాల నవంబర్ 12 
అబ్దుల్లాపూర్ మెట్  తాహసీల్దార్ విజయరెడ్డి హత్యను నిరసిస్తూ గత వారం రోజులుగా విధులకు దూరంగా ఉంటున్నా రెవెన్యూ ఉద్యోగులు అధికారులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాష్ట్ర సంఘ ప్రతినిధులకు సోమవారం ఇచ్చిన హామీతో మంగళవారం సెలవు దినం అయినందున బుధవారం నుంచి విధులకు హాజరు కావాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జగిత్యాల జిల్లా శాఖ నిర్ణయించింది మంగళవారం జిల్లా రెవెన్యూ సంఘ భవనంలో రెవెన్యూ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు ఎండి .వకీల్, కలెక్టరేట్ ఏవో వెంకటేష్, టీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ శశిధర్ ల ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ సంఘం (ట్రైసా) ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల రక్షణకు చర్యలు తీసుకుంటామని రెవెన్యూ రికార్డులకు భద్రత కల్పిస్తామని ప్రతి తాహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక కానిస్టేబుల్ ని నియమిస్తామని  వారం పది రోజుల్లో సీఎం కేసీఆర్ తో సమావేశం ఏర్పాటు చేయించి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని విజయ రెడ్డి ఆమె డ్రైవర్ కుటుంబాలను ఆదుకుంటామని రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి లతో సుదీర్ఘంగా చర్చించి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సోమేష్ కుమార్ తో మాట్లాడా రని వెల్లడించారు . టీ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కారం రవీందర్రెడ్డి, రెవెన్యూ జేఎసి రాష్ట్ర చైర్మన్ వంగ రవీందర్రెడ్డి లు కొనసాగుతున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెవెన్యూ జే.ఏ.సి  పేరుతో కొందరు ప్రకటిస్తున్న ఉద్యమ కార్యక్రమాలలో డిప్యూటీ కలెక్టర్ల నుంచి తాహసీల్దార్ లు వీఆర్ఏ ల వరకు తమ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు సర్వీసుల సంఘం ఉద్యోగులు అధికారులు పాల్గొనగలరని అన్నారు. జగిత్యాల జిల్లాలో రెవిన్యూ ఉద్యోగుల్లో మనోధైర్యం కల్పించిన జిల్లా కలెక్టర్ శరత్, అడిషనల్ ఎస్పీ దక్షిణ మూర్తి లకు కృతజ్ఞతలు తెలిపారు. గత వారం రోజులుగా వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా రెవెన్యూ ఉద్యోగులకు అధికారులకు ట్రైసా జిల్లా శాఖ తరపున ఉద్యమాభి వందనాలు తెలిపారు.ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్షుడు ఎండి వకీల్, కార్యదర్శి చేలుకల కృష్ణ, కలెక్టరేట్ ఏవో వెంకటేష్, ఆర్డీవో కార్యాలయ ఏవో దిలీప్ నాయక్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్, సంఘ నాయకులు బల భక్తుల భాస్కర్, సత్యనారాయణ, ఖాదర్, శేఖర్, సంజీవ్, క్రాంతి, శ్యామ్, రాజేందర్ రావు, రాజేంద్ర ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts