YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 జగన్ కు రాజశేఖర్ మద్దతు

 జగన్ కు రాజశేఖర్ మద్దతు

 జగన్ కు రాజశేఖర్ మద్దతు
హైద్రాబాద్, నవంబర్ 12, 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హీరో రాజశేఖర్ మద్దతు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తన మద్దతు ముఖ్యమంత్రి జగన్‌కే అంటూ రాజశేఖర్ ట్వీట్లు చేశారు. తాను సీఎంకు ఎందుకు మద్దతు ఇస్తున్నానో కూడా చెప్పుకొచ్చారు.రాజశేఖర్ తన ట్వీట్‌లో ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌గారు తీసుకున్ని నిర్ణయం సరైంది. నేట ప్రపంచంలో ఉద్యోగాలు పొందడానికి, ఇతరులతో మాట్లాడటానికి ఇంగ్లీష్ చాలా ముఖ్యమైంది. చాలామంది ఇంగ్లీష్ రాకపోవడంతో ఉన్నత చదవుల తర్వాత ఉద్యోగాలు పొందే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు’అన్నారు.ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల.. ఇలాంటి సమస్యలకు ముగింపు పలకొచ్చు. అందుకే నేను ఈ నిర్ణయాన్ని పూర్తిగా మద్దతు తెలుపుతున్నా. అంతేకాదు మన మాతృభాష తెలుగును కూడా తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్‌గా ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరికీ విద్య సమానంగా అందాలని కూడా సూచించారు రాజేశేఖర్.

Related Posts