YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఉప రాష్ట్రపతిపై వ్యాఖ్యానించడం తగదు

ఉప రాష్ట్రపతిపై వ్యాఖ్యానించడం తగదు

ఉప రాష్ట్రపతిపై వ్యాఖ్యానించడం తగదు
విశాఖపట్నం నవంబర్ 11 
రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడు ని ఎపి సీఎం జగన్ వ్యక్తిగతంగా విమర్శించడం దురదృష్టకరమని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు  విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. తెలుగు భాష కోసం వెంకయ్య నాయుడు విశేష కృషి చేసారు. మెకాలే, నిజాం లకు వారసుడిగా జగన్ వ్యవహరించారని విమర్శించారు. రాజ్యాంగ పదవులపై గౌరవం లేనప్పుడు గవర్నర్ చేత సీఎం ఎందుకు ప్రమాణం చేయుంచుకున్నారు. దయచేసి ముందు మీరు భారత రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకోండని సూచించారు. అసలు వెంకయ్య నాయుడు  గురించి మీరు మాట్లాడవలసిన అవసరం సందర్భం ఏముంది?  రాజ్యాంగ పదవులలో వున్న వ్యక్తుల గురించి మాట్లాడకూడదనీ కనీస అవగాహన కానీ, ఆలోచన కానీ మీకు లేవా అని ప్రశ్నించారు. అధికార తెలుగు భాషను ముఖ్యమంత్రి అవనించడమే. అనకాపల్లిలో కాని అమెరికా లోకాని వెంకయ్య  ఒకేలాగ అన్నిభాషల విషయంలో ఒకేలాగ మాట్లాడుతారు. తెలుగులో చదువుకున్న పివి నరసింహరావు ప్రధానిగా కాలేదా. రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి  పనిచేయలేదా.  నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  ఉన్నత స్థానంలో దేశద్వితియపౌరుడుగా అత్యన్నతతస్థాయిలో ఉన్నవిషయం మీకుకూడ తెలుసు కాదా అని అన్నారు. ఇలా వ్యవహరిస్తే మీ పార్టీకి మంచిది కాదు. మాతృభాషను అందరూ గౌరవించాలి అని వెంకయ్యనాయుడు చెప్పడం తప్పా. మీ తండ్రి తెలుగులో చదువుకోలేదా. ముఖ్యమంత్రిగా పనిచేయలేదా. ప్రజా సమస్యలను ప్రక్కదారి పట్టించడమే మీఅలోచనా అని ప్రశ్నించారు. ఎన్ని కార్పొరేట్ స్కూళ్లను మూసేసారో సీఎం చెప్పాలి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా. యార్లగడ్డ ఉద్యోగం ఉందా.. లేదో.. చెప్పాలి. మీ తండ్రి ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించిన విషయం గుర్తుంచుకోవాలి. చరిత్రలో చాలామంది నియంతలు ఏమయ్యారో తెలుసు కోవాలి. చరిత్రలో మీ పేరు మొదట ఉండాలా.. చివర ఉండాలా.. నిర్ణయించుకోండని అన్నారు.  ప్రభుత్వ తీరు గొయ్యి తవుకుని ఆ గొయ్యిలో పడ్డట్టుగా ఉండదు. చంద్రబాబుతో బీజేపీ కలిసే ఆందోళనలలో పాల్గొనదని అన్నారు. 

Related Posts