YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న మరో ఆర్టీసీ ఉద్యోగి

మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న మరో ఆర్టీసీ ఉద్యోగి

మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న మరో ఆర్టీసీ ఉద్యోగి
హైదరాబాద్ నవంబర్ 13
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తన లేఖలో పేర్కొని తనువు చాలించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న ఆవుల నరేశ్‌  బుధవారం తెల్లవారం జామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేశ్‌ మృతిచెందాడు. నరేశ్ కు భార్య పూలమ్మ, కుమారులు శ్రీకాంత్, సాయి కిరణ్ ఉన్నారు. 14 ఏండ్ల నుంచి  ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న ఆవుల నరేశ్‌ సమ్మె ప్రారంభమైన రోజు నుంచి తీవ్ర మానసిన వత్తిడిలో ఉన్నాడు. నరేష్ భార్య గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమె మందులకు నెలకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతున్నాయనీ. మరోవైపు పిల్లల చదువుతో నరేశ్‌ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు సాటి ఉద్యోగులు తెలిపారు. నరేశ్‌ ఆత్మహత్య  తెలుసుకున్న కార్మి కులు,  పార్టీల నేతలు ఆస్పత్రికి తరలివచ్చారు. మృతదేహంతో కార్మికులు, నేతలు ర్యాలీ చేపట్టారు.. ఆస్పత్రి నుంచి బస్సు డిపో వరకు ర్యాలీ చేపట్టి  డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Related Posts