YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

కోట ప్లాట్లలో కోర్టును ధిక్కరిస్తే భారీ మూల్యం: జూపల్లి

కోట ప్లాట్లలో కోర్టును ధిక్కరిస్తే భారీ మూల్యం: జూపల్లి

కోట ప్లాట్లలో కోర్టును ధిక్కరిస్తే భారీ మూల్యం: జూపల్లి
హైదరాబాద్ నవంబర్ 13
కొల్లాపూర్ రాజావారి కోటలో ప్లాట్లు కొన్న వారికి చట్టంపై పూర్తి అవగాహన కల్పించే విధంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడం ఈ ప్రాంత ప్రజల ప్రశంసలు అందుకుంటున్నది. ఎవరో చెప్పే మాటలు విని కోటలో ప్లాట్లు కొనడం ద్వారా నష్టపోవడానికి అవకాశం ఉందని ఆయన చెబుతున్న మాటలు వైరల్ అవుతున్నాయి. శ్రేయోభిలాషిగా తాను చెబుతున్న విషయాలు ఆలకించాలని జూపల్లి కోరుతున్నారు. ముంబయిలో ఆదర్శ సొసైటీ ఉదాహరణను ఆయన ఈ సందర్భంగా చెబుతున్నారు. ఆదర్శ సొసైటీలో వందల కోట్ల రూపాయల విలువ చేసే అపార్టుమెంట్లను నిర్మించుకున్నారు. కేసు కోర్టుకు వెళ్లిన తర్వాత వందల కోట్ల రూపాయల విలువ చేసే అపార్టుమెంట్లను కూల్చివేశారు. ఈ సంఘటనకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే విధంగా కోర్టు వ్యవహారాల్లో ఉన్న భూములను ఎలా అమ్ముతారని? ఎలా కొంటారని?  నిర్మాణం ఎలా చెస్తారని? రాష్ట మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన కొన్ని ముఖ్య అంశాలను మరిన్ని మీ ముందుకు తెస్తున్నాము. కోర్టు వ్యవహారంలో ఉన్న భూములు అమ్మిన, కొన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రస్తావిస్తూ కోర్టును ధిక్కరించి నిర్మాణం చేస్తే కోర్టు తీర్పు అనంతరం కేరళలో 1100 అపార్ట్ మెంట్స్ ను కూలగొట్టారానే అంశాన్ని ఆయన తెలియచేశారు. కోర్టు ను అందరూ గౌరవించాలన్నారు. తీర్పును  స్వాగతించాలని ఆయన కోరారు. అంతేకాని కోర్టు ధిక్కరించి అనుమతులు లేని స్థలంలో ప్లాట్లు కొన్ని నిర్మాణం చేసుకొని తర్వాత బాధపడవద్దని, మరోసారి ఆర్థికంగా ఇబ్బందుల పాలు కాకూడదని కొల్లాపూర్ రాజా బంగ్లా ప్రహరీ స్థలాలను కొన్న ప్రజలకు ఒక శ్రేయోభిలాషిలాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. హై కోర్టు లో దీనికి సంబంధించిన కేసు పెండింగులో ఉందని చెప్పారు. తీర్పు వచ్చే వరకు అందరూ కట్టుబడి ఉండాలని తెలిపారు.

Related Posts