YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

గ్రామ న్యాయాలయాలకు శ్రీకారం

గ్రామ న్యాయాలయాలకు శ్రీకారం

గ్రామ న్యాయాలయాలకు శ్రీకారం
అమరావతి నవంబర్ 13, 
ఇసుక రవాణా కు సంబంధించి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ రవాణా కు పాల్పడితే రెండేళ్ళు కఠిన జైల్ శిక్ష విధించనుంది. దీంతో పాటు  ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలన్నింటిలోను ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అదే విధంగా మొక్కజొన్న ధరలు పడిపోతుండటంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. వారం రోజుల క్రితం మొక్కజొన్న క్వింటాలు ధర రూ.2200 ఉండేదని.. ఇప్పుడు రూ.1500కు పడిపోయిందని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు  మంత్రి మండలి దృష్టికి. తీసుకు వచ్చారు. రైతులకు కనీస మద్దతు ధర .1750 రూపాయలు   కూడా రావడం లేదని మంత్రివర్గం వద్ద ప్రస్తావించారు. ఈ క్రమంలో రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు నష్టం రాకుండా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు..విజయనగరం కర్నూలు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి..ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమల నుంచి వ్యర్థాల సేకరణ నుంచి డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలుగు లేదా ఉర్దూ ఒక భాషగా తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు,విద్యా కమిటీల నుంచి అభిప్రాయాల స్వీకరణ తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాం అని మంత్రి మండలి లో చర్చ జరిగింది.
ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారులకు 10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. పట్టణాల్లో అనధికార లే అవుట్ లను  క్రమబద్దీకరణకు నిర్ణయం తీసుకున్నారు  ఏపీ సోలార్ పవర్ పాలసీ 2018,విండ్ పవర్ పాలసీ 2018 లలో సవరణలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ స్థాయిలో వివాదాల పరిష్కారానికి గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం వేసింది  84 చోట్ల గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది క్యాబినెట్. రాష్ట్రంలో 8 ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Related Posts