YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

బ్లూ ఫ్రాడ్... ఇసుక దోపిడి

బ్లూ ఫ్రాడ్... ఇసుక దోపిడి

బ్లూ ఫ్రాడ్... ఇసుక దోపిడి
విశాఖపట్టణం, నవంబర్ 14  
ఏపీలో ఇసుక కొరత రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు లాంగ్ మార్చ్‌లు, దీక్షలకు దిగుతున్నాయి. ఇసుక కొరతకు వరదలు కారణమని ప్రభుత్వం చెబుతుండగా.. వైఎస్ఆర్సీపీ నేతలు ఇసుకను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వం ఇసుక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన జగన్ సర్కార్ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి.. ఆన్‌లైన్ ద్వారా ఇసుక కొనుగోలు చేసేలా.. శాండ్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీని వల్ల అక్రమాలకు ఆస్కారం ఉండదనే ప్రభుత్వం భావించింది.కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన శాండ్ పోర్టల్ హ్యాకింగ్ గురైంది. బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీ.. శాండ్ వెబ్ సైటును హ్యాక్ చేసినట్లుగా సీఐడీ గుర్తించింది. దీంతో బ్లూ ఫ్రాగ్ కంపెనీలో సోదాలు నిర్వహించగా.. పలు కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇసుక కృత్రిమ కొరత సృష్టించేందుకే శాండ్ వెబ్ సైట్‌ను బ్లూ ఫ్రాగ్ హ్యాక్ చేసినట్లుగా సీఐడీ గుర్తించింది.బ్లూ ఫ్రాగ్ సంస్థలోని కొంతమంది ఉద్యోగులు శాండ్ వెబ్ సర్వర్లను హ్యాక్ చేసి.. ఇసుక సరఫరాను బ్లాక్ చేశారని ఫిర్యాదు అందింది. దీంతో ఈ సోదాలు చేపట్టారని తెలుస్తోంది. శాండ్ వెబ్ సైట్ సాఫ్ట్ వేర్‌ను డెవలప్ చేయడంతోపాటు.. పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలను కూడా బ్లూ ఫ్రాంగ్ సంస్థే పర్యవేక్షిస్తోందని సమాచారం.శాండ్ పోర్టల్ హ్యాక్ వెనుక ఎవరున్నారనే దిశగా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. బ్లూ ఫ్రాగ్ సంస్థ నారా లోకేశ్ సన్నిహితుడి కుటుంబీకులకు చెందినదని ప్రచారం జరుగుతోంది. కాగా, బ్లూ ఫ్రాంగ్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ ప్రకటించారు.ఏపీలో ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడితే రూ. 2 లక్షల జరిమానాతో రెండేళ్ల జైలు విధించాలని కేబినెట్ తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో.. శాండ్ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైనట్టు తేలడం గమనార్హం.

Related Posts