YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

గుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

గుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

గుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
యాదాద్రి భువనగిరి నవంబర్ 14  
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 41వ రోజు కొనసాగింది. ఆర్టీసీ సమ్మె నిరసనలో భాగంగా గురువారం యాదగిరిగుట్ట బస్సు డిపో నుండి బస్సులు బయటకి రాకుండా డిపో గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికులు డిపో గేటు ముందు కూర్చొని నిరసన తెలుపుతున్న క్రమంలో ఓ కార్మికుడు ఆర్టీసీ సమ్మె విషయంలో తీవ్ర మనోవేదన చెంది అస్వస్థతకు గురయ్యాడు. అస్వస్థతకు గురైన కార్మికుడిని చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు.  అయితే ప్రభుత్వం నిరంకుశ వైఖరి కారణంగానే మనోవేదన చెంది ఆర్టీసీ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడని   అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలవాలని డిమాండ్ చేసారు. 

Related Posts