YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

 చంద్రయాన్ 3 షురూ అయింది

 చంద్రయాన్ 3 షురూ అయింది

 చంద్రయాన్ 3 షురూ అయింది
బెంగళూర్, నవంబర్ 14,
ఇటీవలే చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో.. చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధపడుతోంది. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన చంద్రయాన్-2 ప్రయోగం పాక్షికంగా విజయవంతమైన సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత దాని జాడ కనిపించలేదు. నాసా కూడా విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం ప్రయత్నించింది. ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఇస్రో మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో ఇప్పటికే పని ప్రారంభించిందని సమాచారం. 2020 నవంబర్‌ లక్ష్యంగా ఇస్రో పని చేస్తోందని తెలుస్తోంది. చంద్రయాన్-3 కోసం కమిటీని ఏర్పాటు చేసిన ఇస్రో.. అక్టోబర్ నుంచి నాలుగు అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహించింది.చంద్రయాన్-2 ఆర్బిటార్ బాగానే పని చేస్తుందన్న.. తుదపరి మిషన్‌లో కేవలం ల్యాండర్, రోవర్‌ను మాత్రమే చంద్రుడి మీదకు పంపే అవకాశం ఉంది. దీని వల్ల మిషన్ ఖర్చు మరింత తగ్గుతుంది.మూన్ మిషన్‌కు సంబంధించిన పని ఇప్పటికే మొదలైందని.. చంద్రుడి మీద ఏ భాగంలో చంద్రయాన్-3ను దించాలనే విషయమై సమాలోచనలు జరుగుతున్న సమాచారం. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 300 మీటర్ల ఎత్తులో ఉన్నంత వరకూ చంద్రయాన్-2 వ్యవస్థ సక్రమంగానే పనిచేసింది. ఆ తర్వాతే ల్యాండర్ చందమామ ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీంతో చంద్రయాన్-3లో ల్యాండర్‌ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా చూడటంపై ఇస్రో మరింత శ్రద్ధపెట్టే అవకాశం ఉంది.

Related Posts