YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ట్రేడ్ లైసెన్స్ ఫీజుల స‌వ‌ర‌ణ‌కు స్టాండింగ్ ఆమోదం

ట్రేడ్ లైసెన్స్ ఫీజుల స‌వ‌ర‌ణ‌కు స్టాండింగ్ ఆమోదం

ట్రేడ్ లైసెన్స్ ఫీజుల స‌వ‌ర‌ణ‌కు స్టాండింగ్ ఆమోదం
హైదరాబాద్ 
 జీహెచ్ఎంసీ 2020-21 ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్ ముసాయిదాను స్టాండింగ్ క‌మిటిలో ప్ర‌వేశ‌పెట్టారు. 2020-21 సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ‌పెట్టిన‌ బ‌డ్జెట్ ప్రతిపాద‌న‌ల‌పై   పూర్తిస్థాయి చ‌ర్చ నిర్వ‌హించి డిసెంబ‌ర్‌ 10వ తేదీలోపు స్టాండింగ్ క‌మిటి ఆమోదించాల్సి ఉంటుంది. 2019 డిసెంబ‌ర్ 15న జ‌న‌ర‌ల్ బాడిలో ప్ర‌వేశ‌పెట్టి 2020 జ‌న‌వ‌రి 10న పూర్తిస్థాయి స‌మీక్ష నిర్వ‌హించాల్సి ఉంటుంది. 2020 ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన బ‌డ్జెట్‌ను కార్పొరేష‌న్ ఆమోదించి 2020 మార్చి 7వ తేదీన తుది బ‌డ్జెట్ ను ప్ర‌భుత్వ ఆమోదం కోసం  పంపించాల్సి ఉంటుంద‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌ స్టాండింగ్ క‌మిటికి తెలియజేశారు. ఈ బ‌డ్జెట్ ముసాయిదా పై అద్య‌య‌నం చేసిన పిద‌ప వ‌చ్చే స్టాండింగ్ క‌మిటీలో చ‌ర్చించడానికి అనుమ‌తి కోరుతూ స్టాండింగ్ క‌మిటి స‌భ్యులు ప్ర‌తిపాదించ‌డంతో మేయ‌ర్ బొంతు రామ్మోహన్ ఇందుకు అంగీక‌రించారు. 2020-21 బ‌డ్జెట్ ముసాయిదా వివ‌రాలు...2019-20 ఆమోదిత బ‌డ్జెట్ రూ. 6150 కోట్లు2019-20 స‌వ‌రించిన బ‌డ్జెట్ మొత్తం రూ. 5254 కోట్లు2020-21కు ప్ర‌తిపాదిత ముసాయిదా బ‌డ్జెట్ మొత్తం రూ. 5380 కోట్లుమేజ‌ర్ ప్రాజెక్ట్‌ల‌కు ప్ర‌తిపాదిత బ‌డ్జెట్ మొత్తం రూ. 1593 కోట్లు.స్టాండింగ్ క‌మిటిలో ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం తెలిపారు. ఆమోదం పొందిన తీర్మానాలు...* జిహెచ్ఎంసిలో ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న 30 మంది జూనియ‌ర్ ఎన‌లిస్ట్‌ల‌ను 2019 సెప్టెంబ‌ర్ నుండి 2020 ఆగ‌ష్టు వ‌ర‌కు పొడిగిస్తూ తీర్మాణం.* గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న ట్రేడ్ లైసెన్స్‌ల రేట్ల‌ను స‌వ‌రిస్తూ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి ఆమోదం.* జిహెచ్ఎంసిలోని 3,142 శాశ్వ‌త ఉద్యోగుల‌కు ఆరోగ్య బీమా క‌ల్ప‌న‌కు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 3,71,54,150ల‌ను చెల్లించిన అంశానికి ఆమోదం.* 17 మంది అసిస్టెంట్ ఎంట‌మాల‌జిస్ట్‌ల‌ను ఔట్‌సోర్సింగ్ ప‌ద్ద‌తిన 2020 జ‌న‌వ‌రి 1 నుండి 2020 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు సంవ‌త్స‌రం పాటు నియ‌మించేందుకు ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం.* మున్సిప‌ల్ ప‌రిపాల‌న శాఖ‌లో అద‌న‌పు కార్య‌ద‌ర్శి ఎల్‌.శ‌ర్మ‌న్‌, జిహెచ్ఎంసి స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ సుజాత గుప్త‌ల‌కు అద్దె ప్రాతిప‌దిక‌న ఇన్నోవా వాహ‌నం సౌక‌ర్యాన్ని క‌ల్పించే తీర్మానానికి ఆమోదం.* మున్సిప‌ల్ మార్కెట్ల‌లో దుకాణాల కేటాయింపులో ప్ర‌తి వంద షాపుల్లో ఎస్సీల‌కు 15, ఎస్టిల‌కు 06, విక‌లాంగులు 03, ఎస్‌.ఎల్‌.ఎఫ్ 10, నాయి బ్రాహ్మ‌ణులు 05, జ‌న‌ర‌ల్ 61 యూనిట్ల‌ను కేటాయించే తీర్మానానికి ఆమోదం.

Related Posts