YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

సీఎంఒ ఎషియా వారి  తెలంగాణ బెస్ట్ బ్రాండ్ అవార్డు స్వీకరించిన  జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన

సీఎంఒ ఎషియా వారి  తెలంగాణ బెస్ట్ బ్రాండ్ అవార్డు స్వీకరించిన  జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన

సీఎంఒ ఎషియా వారి  తెలంగాణ బెస్ట్ బ్రాండ్ అవార్డు స్వీకరించిన  జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన

పెద్దపల్లి నవంబర్ 15  : 
సీఎంఒ ఎషియా అనే సంస్థ వారు అందిస్తున్న  ప్రతిష్టాత్మకమైన  తెలంగాణ బెస్ట్ బ్రాండ్ అవార్డును  పెద్దపల్లి  జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన శుక్రవారం స్వీకరించారు.  పెద్దపల్లి జిల్లాలో  మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతి కోసం కలెక్టర్ తీసుకున్న చర్యలు , చేపట్టిన వినూత్న కార్యక్రమాల ఫలితంగా   పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను  మహిళా అభ్యున్నతికి కృషి చేసినకందుకు సీఎంఒ ఎషియా వారి తెలంగాణ బెస్ట్ బ్రాండ్ అవార్డులో మహిళా నేతృత్వ విభాగంలో కలెక్టర్ గారిని  ఎంపిక చేయడం జరిగింది.  పెద్దపల్లి జిల్లాలో  మహిళల అభ్యున్నతి  , ఆర్థికాభివృద్ది చెందెందుకు గాను ఆసక్తి ఉన్న మహిళా సంఘాలను ఎంపిక  చేసుకొని వారిచే  పెద్దపల్లిలో  బతుకమ్మ మెస్,  కమాన్ పూర్ లో అపెరల్  పరిశ్రమ, బట్ట సంచుల తయారీ కేంద్రం, ఇతర  చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించడంలో  జిల్లా కలెక్టర్ బ్యాంకర్ల సహకారంతో మహిళలో అవగాహన   పెంపొందించి స్థాపించడం జరిగింది. అదే విధంగా మహిళల వ్యక్తిగత  పరిశుభ్రతకు ప్రాధాన్యతను కల్పిస్తూ  పర్యావరణ హితమైన సబల శానిటరీ న్యాపకిన్ కేంద్రం స్థాపించడం జరిగింది. అదే విధంగా  పెద్దపల్లి  జిల్లాను స్వచ్చ జిల్లాగా తీర్చిదిద్దడంలో ,  జిల్లాలో పచ్చదనం  పెంపొందించడంలో  కలెక్టర్ మహిళలకు కీలకపాత్ర అందిస్తూ మంచి ఫలితాలను సాధించారు.  జిల్లాలో గతంలో ఎన్నడు లేనివిధంగా మహిళల సహకారంతో పంచసూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి  కార్యచరణను జిల్లా కలెక్టర్ రుపొందించారు. జిల్లా అభివృద్దికి మహిళలను కీలకంగా చేస్తూ వారికి మంచి నాయకత్వం వహించడంలో  కలెక్టర్ చేసిన కృషికి ఫలితంగా సీఎం ఎషియా సంస్థ వారు తెలంగాణ బెస్ట్ బ్రాండ్స్ అవార్డులలో కలెక్టర్ కు మహిళల నేతృత్వం వహించినందుకు అవార్డును అందించారు.  అట్టి అవార్డును   శుక్రవారం  హైదరాబాద్ లో తాజ్ బంజారాలో నిర్వహించిన కార్యక్రమంలో   ప్రపంచ సీఎస్ఆర్ డే, ప్రపంచ సస్టెనబిలిటీ సంస్థాకపుడు డా.ఆర్.ఎల్ బాటియా,, సీఎంఒ ఎషియా గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  డా.అలోక్ పండిత్ ల చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు స్వికరించారు. 
అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ  పెద్దపల్లి జిల్లా అభివృద్దిలో మహిళల పాత్రను గుర్తించి తనకు అవార్డు అందించినందుకు కృతజ్ఞతులు తెలియజేసారు. జిల్లాలోని చైతన్యం కల్గిన మహిళలు,  అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల తోడ్పాటు ,ప్రజాప్రతినిధుల  సహకారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహంతో  పెద్దపల్లి జిల్లాలో మంచి విజయాలు సాధించామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో  సింగల్  యూసెజ్ ప్లాస్టిక్ నిషేదించామని, వాటి స్థానంలొ వినియోగించడానికి బట్టల సంచుల తయారీ కేంద్రం మహిళలతో ఏర్పాటు చేసామని, అదే విధంగా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేదించడానికి ప్లాస్టిక్ కు ప్రత్యాహ్నమయ వస్తువులు తయారు చేసే విధంగా చిన్న చిన్న పరిశ్రమలు గ్రామాలో ఏర్పాటు చేసే దిశగా మహిళా సంఘాలకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని  కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో సైతం అవార్డు అందించిన స్పూర్తితో మరిన్ని మంచి కార్యక్రమాలు   జిల్లాలోని మహిళల అభ్యున్నతి కోసం నిర్వహిస్తామని,  జిల్లాలో చేసిన పనికి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ తన సంతోషం వ్యక్తం చేసారు.

Related Posts