YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

ఆర్టీసీలో వాలంటరీ రిటైర్మెంట్..

ఆర్టీసీలో వాలంటరీ రిటైర్మెంట్..

ఆర్టీసీలో వాలంటరీ రిటైర్మెంట్..
ఉద్యోగులను తగ్గించుకొనే యోచనలో ప్రభుత్వం
హైద్రాబాద్, నవంబర్ 16,
ఆర్టీసీ ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ను ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.  సంస్థలో ఇప్పుడున్న కార్మికుల సంఖ్యను కుదించేందుకు ఉన్న  ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.  కార్మికులు సమ్మెలో ఉన్న   టైమ్ను అవకాశంగా తీసుకొని..  ఇప్పటికే రాష్ట్రంలోని సగం రూట్లను, బస్సులను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే వరుసలో  సిబ్బందిని తగ్గించుకునేందుకు  కార్మికులకు  వీఆర్ఎస్ ( వాలంటరీ రిటైర్మెంట్ స్కీం)  అమలు చేసే కార్యాచరణపై దృష్టి సారించింది.  ఆర్టీసీలో  రిటైరైన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలను ప్రభుత్వం  కొంతకాలం కిందటే  ఆపేసింది.  5100 ప్రైవేటు రూట్లు,  బస్సులను అనుమతిస్తూ  ఇటీవలే రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది.   ఆ బస్సులు రోడ్డెక్కితే.. ఆర్టీసీ లోని సగం బస్సులు మూలన పడుతాయి.   ప్రస్తుతం  పని చేస్తున్న సిబ్బందిలో  దాదాపు 30 నుంచి 40 శాతం  మందికి పని లేకుండా పోతుంది.   ప్రస్తుతం ఆర్టీసీలో కార్మికులు, ఇతర సపోర్టింగ్ స్టాప్ తో కలిపి 49,733 మంది ఉద్యోగులున్నారు.   వీరందరికి జీతాలివ్వడం పెద్ద భారమేనని  ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే  కొంత మందిని ఇంటికి పంపించాలని ఆలోచనలు చేస్తో్ంది. ‘ఆర్టీసీలో  వీఆర్ఎస్ అమలు చేయక తప్పదు. గరిష్టంగా ఎంత వయస్సు దాటిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం జరిగింది…’ అని ఒక  సీనియర్ అధికారి చెప్పారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అధీనంలోని  బీఎస్ఎన్ఎల్ లో యాభై ఏళ్లు నిండిన వారికి వీఆర్ఎస్ పథకం ప్రకటించారు. అదే తరహాలో  ఆర్టీసీలో కూడా 50 ఏళ్లు దాటిన వారందరికి  వీఆర్ఎస్ వర్తించేలా విధివిధానాలుంటాయని చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న  ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలి.. ఎంత మందిని తొలగించాలని ప్రభుత్వం ముందే లెక్కలు వేసుకుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. సగం బస్సులు  ప్రైవేటుకు అప్పగించే నిర్ణయానికి ముందే ప్రభుత్వం వీఆర్ఎస్ స్కీమ్కు సూచనప్రాయంగా  సంకేతాలు జారీ చేసిందని చెపుతున్నారు.వచ్చే ఏడాది నుంచి వీఆర్ఎస్ స్కీం వీఆర్ఎస్ స్కీం ను ఆర్టీసీలో వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.దశల వారిగా ప్రైవేటు బస్సులను రోడ్డు మీదికి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది తొలి రెండు మూడు నెలల్లో మొదటి దశలో సుమారు 1,200 బస్సులకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది.  మొదటి దశలో ప్రైవేటు బస్సులు రాగానే వీఆర్ఎస్ స్కీంను ప్రకటించే అవకాశం ఉందని రవాణా శాఖలోని ఓ సీనియర్ అధికారి చెప్పారు.  ‘మెజారిటీ  కార్మికులు వీఆర్ఎస్ స్కీంకు దరఖాస్తు చేసుకుంటారు. ఎందుకంటే మెరుగైన ప్యాకేజీని ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నం. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంటే ఏ కార్మికుడు వదులుకుంటాడు..’ అని అన్నారు.పదేళ్ల క్రితం సింగరేణి సంస్థలో వీఆర్ఎస్ అమలు చేశారు. అప్పుడు రెండు రకాల ప్యాకేజీలు ఆఫర్ చేశారు.  ఉదాహరణకు  నెలకు రూ.40 వేల జీతమున్న ఒక కార్మికుడు 20 ఏళ్లుగా పని చేశాడు. ఇంకా మూడేళ్ల సర్వీసే మిగిలి ఉందనుకుంటే..  మొదటి ప్యాకేజీ ప్రకారం పని చేసిన సర్వీసు మొత్తంలో  ఏడాదికి ఒక నెల జీతం చొప్పున రూ.8 లక్షలు చెల్లిస్తారు.  మిగిలిన 36 నెలల సర్వీసుకు చెల్లించే జీతం రూ.14.40 లక్షలు ఒకేసారి ఇవ్వడం రెండో ప్యాకేజీ. ఇందులో ఏది ఎక్కువగా ఉంటే కార్మికుడు అది ఎంచుకోవచ్చు. ‘సింగరేణి మోడల్లో  ఆర్టీసీ ఇచ్చే ప్యాకేజీ  ఆకర్షణీయంగా ఉంటే కార్మికుల నుంచి స్పందన ఉంటుందని, లేకపోతే వృథా ప్రయాసే,  రిటైర్మెంట్కంటే ముందే తనకు ఎక్కువ డబ్బు వస్తుందనుకుంటే కార్మికులు వీఆర్ఎస్కు సిద్ధపడుతారు. లేకపోతే మాత్రం దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉండదు’ అని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.  సమ్మెలో ఉన్న కార్మికులను సెల్ప్ డిస్మిస్చేయటం, ముందుగా నోటీసులు ఇవ్వకుండా తొలగించటం సాధ్యం కాదని  కార్మిక శాఖ, న్యాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి తగిన సూచనలు చేశారు. అందుకే వీఆర్ఎస్ స్కీమ్ రూపకల్పనకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందనే చర్చలు జోరందుకున్నాయి.ప్రైవేటు బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతోనే వీఆర్ఎస్ అమలు చేయాలని ప్రభుత్వం దూరాలోచన చేసింది. ప్రైవేటు రూట్లు సొంతం చేసుకున్న ఆపరేటర్లు  ప్రతి మూడు నెలలకు ఓసారి ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విధివిధానాలు వెలువడితే  ఈ ఫీజు ఎంత ఉంటుందనే స్పష్టత వస్తుంది.   కాని పెద్ద మొత్తంలోనే ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.  ఈ ప్రైవేటు రూట్లతో వచ్చే  డబ్బును ఇతర అవసరాలకు ఖర్చు చేయకుండా ఆర్టీసీకే ఇవ్వాలని ..  నష్టాలతో నడిచే పల్లె వెలుగు బస్సులకు కొంత కేటాయించి, మెజారిటీ నిధులను  వీఆర్ఎస్ స్కీమ్కు కేటాయించే అవకాశముందని ఓ కీలక అధికారి అన్నారు.  ‘ రూట్ల అమ్మకం ద్వారా వచ్చిన  డబ్సును ప్రభుత్వం గ్రాంట్ రూపంలో ఆర్టీసీకి ఇస్తుంది. దాన్ని వీఆర్ఎస్ కోసం కేటాయిస్తాం.  సరిపోక పోతే  కొన్ని ఆస్థులను లీజుకు  ఇచ్చి నిధులు సమీకరిస్తాం…’ అన్నారు. వీఆర్ఎస్ కు ఎంత మంది కార్మికులు ముందుకొస్తారనేది లెక్కతేలితే నిధుల  సమీకరణ పెద్ద సమస్య కాదని చెప్పారు.ప్రస్తుతం ఆర్టీసీలో 2100 అద్దె బస్సులు నడుస్తున్నాయి. అద్దె బస్సుల ఓనర్లే వీటికి డ్రైవర్లను నియమించుకుంటారు. కానీ కండక్టర్ ను ఆర్టీసీ సంస్థ కేటాయిస్తుంది.  కొంత కాలంగా డ్రైవర్ల, కండక్టర్ల నియామకం పూర్తిగా నిలిచిపోయింది.  రాష్ట్ర విభజనకు ముందు ఆర్టీసీలో  దాదాపు అయిదు వేల మందికి పైగా  డ్రైవర్లు, కండక్టర్లు కాంట్రాక్టు పద్ధతిన  పనిచేసేవారు. సంస్థ విభజనలో భాగంగా అందులో రెండు వేల మందిని టీఎస్ఆర్టీసీకి కేటాయించారు. వీరందరినీ  రెగ్యులర్ చేశారు. కానీ ఖాళీల భర్తీ చేయలేదు.  ప్రభుత్వం  వీఆర్ఎస్ అమలు చేస్తే ప్రధానంగా కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాలకు కోత పడుతుందనే అభిప్రాయాలున్నాయి.ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 20 వేల మంది కార్మికులు యాభై  ఏళ్లు దాటిన వారున్నారు.   వీఆర్ఎస్ పథకం అమలు చేస్తే వీరందరి ఉద్యోగాలకు కోత పడనుంది. ఆర్టీసీలో  ప్రతి నెలా సగటున 200 మంది కార్మికులు రిటైరవుతున్నారు.  నిరుడు  ఆగస్టులో 51,762 మంది కార్మికులుంటే.. ఈ ఏడాది  అగస్టు నాటికి 49,733 మంది కార్మికులు  ఉన్నారు. గత ఏడాదితో పోల్చితే 2029 మంది రిటైరయ్యారు.  రెండు మూడు నెలల్లో ఆర్టీసీలోని 8,357 బస్సుల్లో సుమారు 2,500 బస్సులు  పనికి రాకుండా పోతాయని ఇటీవలే  సీఎం కేసీఆర్  స్వయంగా వెల్లడించారు. వాటి స్థానంలో ప్రైవేటు బస్సులను తీసుకుంటామని చెప్పారు. ప్రైవేటు రూట్లు, చెడిపోయిన బస్సులు పక్కనపెడితే..  5857 సొంత బస్సులే మిగులుతాయని ఆర్టీసీకి చెందిన  ఓ సీనియర్ అధికారి చెప్పారు.  ‘ఆర్టీసీలో ఇప్పటికే  ఒక్కో బస్సుకు సగటున 6 మంది పనిచేస్తున్నారు. సగం ప్రైవేటుకు ఇవ్వడం వల్ల ఒక్కో బస్సుకు 10 మంది కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. ఇది సంస్థకు అదనపు భారమే…’ అన్నారు. అందుకని ఉద్యోగుల కోత తప్పదని వివరించారు.  చేయడానికి పని లేనప్పుడు ఏ సంస్థ కూడా ఎందుకు ఊరికే ఉద్యోగులకు జీతాలు ఇస్తుందని ఆ అధికారి ప్రశ్నించారు

Related Posts