YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 పీకే రిపోర్ట్ పైనే చర్చంతా

 పీకే రిపోర్ట్ పైనే చర్చంతా

 పీకే రిపోర్ట్ పైనే చర్చంతా
శ్రీకాకుళం, నవంబర్ 16
వైఎస్ జగన్ ప్రశాంత్ కిషోర్ ను తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలను జగన్ తూచ తప్పకుండా పాటించారు. ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపికలోనూ ప్రశాంత్ కిషోర్ టీం సలహాలనే జగన్ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం మూడు దఫాలు సర్వేలు చేసి మరీ ఇచ్చిన నివేదికను జగన్ అలక్ష్యం చేయలేదు. అందుకే గత ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి దక్కాయనడంలో అతిశయోక్తి లేదు.అయితే ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన ఒక రిపోర్టు మాత్రం పార్టీలో ఇప్పుడు తీవ్ర చర్చనీ యాంశమైంది. ఒక నాయకుడి ప్రభావం ప్రశాంత్ కిషోర్ టీం పై పడినందునే ఆ రిపోర్ట్ అలా ఇచ్చారని వైసీపీలో చర్చ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఐదు నెలలు దాటు తున్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ టీం నివేదిక తప్పు అని ఎందుకు అంటున్నారు? అలాంటి నియోజకవర్గం ఏంటి? అన్న అనుమానం సహజంగా నే కలుగుతుంది. కానీ జగన్ లక్ష్యం నెరవేరకపోవడం వల్లనే ఈ చర్చ జరుుగుతుందనేది వాస్తవం.వైఎస్ జగన్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అచ్చెన్నాయుడు టార్గెట్ గా ఉండేవారు. అచ్చెన్నాయుడు చేసే విమర్శలు సూటిగా జగన్ కు తాకేవి. దీంతో ఎన్నికలకు ముందు అచ్చెన్నాయుడిని ఓడించేందుకు పెద్ద వ్యూహమే రచించారు జగన్. కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి, సీనియర్ నేత దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ లను ఏకం చేశారు. టెక్కలిని సొంతం చేసుకునే దిశగానే జగన్ అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రశాంత్ కిషోర్ టీం టెక్కలిలలో ఐదు సార్లు సర్వే చేేసిందని చెబుతున్నారు.అయితే ప్రశాంత్ కిషోర్ టీం అక్కడ ఒక నాయకుడిని నమ్మి జగన్ కు తప్పుడు నివేదిక ఇచ్చిందన్న చర్చ పార్టీలో జరుగుతుంది. టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం, సంతబొమ్మాళి, టెక్కలి లో కళింగ సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. టెక్కలిలో పేరాడ తిలక్, శ్రీకాకుళం ఎంపీగా దువ్వాడ శ్రీనివాస్ ను ప్రశాంత్ కిషోర్ టీం సూచించింది. జగన్ వారికే టిక్కెట్లు ఇచ్చారు. అయితే ఇక్కడ సీనియర్ నేత సూచన ప్రకారం ప్రశాంత్ కిషోర్ టీం పనిచేసిందంటున్నారు.ఈ ముగ్గురు నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో స్వల్ప తేడాతో ఇటు శ్రీకాకుళం ఎంపీ సీటు, అటు టెక్కలి అసెంబ్లీ సీటు కోల్పోవాల్సి వచ్చింది. జగన్ తాను టార్గెట్ గా పెట్టుకున్న అచ్చెన్నాయుడిని కూడా ఓడించలేకపోయారు. అలా కాకుండా శ్రీకాకుళం ఎంపీగా కిల్లి కృపారాణి, దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎంపిక చేసి ఉంటే ఖచ్చితంగా రెండు చోట్ల విజయం సాధించి ఉండేవారమని చెబుతున్నారు. పేరాడ తిలక్ కు ఎమ్మెల్సీ ఇచ్చినా సరిపోయేదన్న చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ టీం చేసిన తప్పు వల్ల రెండు సీట్లు కోల్పోయామని, ఆ టీంను ఒక సీనియర్ నేత తప్పుదోవ పట్టించారన్న టాక్ పార్టీలో నడుస్తోంది.

Related Posts