YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

.పేద వర్గాల ప్రజల దృష్టి లో పెట్టులోని సమ్మెను విరమింపజేయండి  ముఖ్య మంత్రికి తెలంగాణ రైతు రాజ్యం పార్టీ విజ్ఞప్తి

.పేద వర్గాల ప్రజల దృష్టి లో పెట్టులోని సమ్మెను విరమింపజేయండి  ముఖ్య మంత్రికి తెలంగాణ రైతు రాజ్యం పార్టీ విజ్ఞప్తి

.పేద వర్గాల ప్రజల దృష్టి లో పెట్టులోని సమ్మెను విరమింపజేయండి
 ముఖ్య మంత్రికి తెలంగాణ రైతు రాజ్యం పార్టీ విజ్ఞప్తి
హైదరాబాద్ నవంబర్ 16 ;
 ఆర్టీసీ కార్మికుల సమ్మె విశయంలో ముఖ్య మంత్రి పంతాలు, పట్టింపులు మాని సమ్మె విరమనకు కృషి చేయాలని తెలంగాణ రైతు రాజ్యం పార్టీరాష్ట్ర అద్యక్షులు గడ్డం రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  ఆర్టీసీ కార్మికుల సమ్మె మూలంగా ఇప్పటికీ 27 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్టీసీ సమ్మెమూలంగా పేద మద్య తరగతి,బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురుకొంటున్నారని తెలిపారు.ప్రజా రవాణా విషయం లో ప్రభుత్వం ప్రజలకోసం కొంత నస్టాన్ని భరించడంలో తప్పులేదన్నారు.పేద ప్రజల కోసం ఎన్నోసంక్షేమ పతకాలు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం ప్రజా రవాణా విషయం లో ఆమాత్రం చేయలేదా అని రవీందత్ రెడ్డి ప్రశ్నించారు.ప్రభుత్వం లో ఆర్టీసీ ని విలీనం చేయాలన్న అంశం పై జేఏసి మెట్టుడిగినప్పటికి ముఖ్య మంత్రి స్పందించక పోవడం సరైన విదానం కాదన్నారు. సమ్మె మూలంగా పేద మద్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదురుకోవలసి వస్తుందన్నారు.ఒక వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె,మరో వైపు రెవెన్యూ ఉద్యోగుల నిరసనలతో ప్రజలు రాస్త్రం ఏమి జరుగుతుందన్నా అయోమయం లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.

Related Posts