
చింతమనేనికి అన్ని కేపుల్లో బెయిల్
ఏలూరు, నవంబర్ 16,
తో.. 67 రోజుల తర్వాత శనివారం ఏలూరు జైలు నుంచి బయటకొచ్చారు. జైలు దగ్గరకు భారీగా చేరుకున్న టీడీపీ నేతలు, అభిమానులు చింతమనేని ప్రభాకర్‌కు ఘన స్వాగతం పలికారు. చింతమనేని జైలు నుంచి బయల్దేరి తన ఇంటికి వెళ్లారు.66 రోజులుగా చింతమనేని ప్రభాకర్ జైలులో ఉన్నారు. ఆయనపై ఏకంగా 18 కేసులు నమోదయ్యాయి. దళితులను దూషించిన కేసులో అరెస్టైన చింతమనేనికి కోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. తర్వాత ఆయనపై ఉన్న పాతకేసులు ఒక్కొక్కటిగా విచారణకు రావడంతో మరికొన్ని కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది. ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో రిమాండ్‌తో చింతమనేని విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. శుక్రవారం చింతమనేని బెయిల్ పిటిషన్‌పై విచారించిన ఏలూరు జిల్లా కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.దళితులను దూషించిన ఆరోపణలపై గత సెప్టెంబర్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. కొద్ది రోజులకే చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత తన భార్య ఆరోగ్యం క్షీణించడంతో చింతమనేని అజ్ఞాతం వీడారు. భార్యాపిల్లలను చూసేందుకు దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలోని తన ఇంటికి వస్తుండగా.. పోలీసులు ప్రభాకర్‌ను సెప్టెంబర్ 11న అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. 67 రోజుల తరువాత అన్ని కేసుల్లో కోర్టు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు.