YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నిరూపిస్తే... రాజకీ్య సన్యాసం

నిరూపిస్తే... రాజకీ్య సన్యాసం

 నిరూపిస్తే... రాజకీ్య సన్యాసం
శ్రీకాకుళం, నవంబర్ 16, 
ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక విషయంలో తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. తన సవాల్‌కు టీడీపీ నేతలు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. శ్రీకాకుళంమండలం కల్లేపల్లిలో ఇసుక వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ఇసుక రీచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. టీడీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అడ్డంగా దోచుకున్నారని మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని.. ఇది ఓర్వలేక ప్రతిపక్ష నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలు తనపై చేసిన ఆరోపణలు నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు.13 జిల్లాల్లో 67మంది వైసీపీ నేతలు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఓ ఛార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. టీడీపీ విడుదల చేసిన జాబితాలో.. ‘తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా, పార్థ సారధి, సామినేని ఉదయభాను, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రోజా, పెద్దిరెడ్డి’లు ఉన్నారు. వీరితో పాటూ అనుచరులకు ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటున్నారు టీడీపీ నేతలు. తన పేరు కూడా ఈ జాబితాలో ఉండటంతో మంత్రి స్పందించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

Related Posts